టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో రామ్ పోతినేని ఒకరు. కామెడీ, యాక్షన్ కలగలిపిన సినిమాలకు అచ్చుగుద్దినట్లు సరిపోయే రామ్ “రెడ్” లాంటి ఊరమాస్ సినిమాలో కూడా ఇరగదీసాడు. ఇక లవర్ బాయ్ గా రామ్ నటనా ప్రతిభ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని వివాహం గురించిన టాపిక్స్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
Advertisement
టాలీవుడ్ లో ఈ మధ్య పెళ్లి బాజాలు బాగానే మోగుతున్నాయి. ఇటీవలే శర్వానంద్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా.. ఫ్యామిలీ క్లబ్ లోకి రామ్ పోతినేని కూడా ఎంటర్ కాబోతున్నారని సినీ ఫక్కీ లో టాక్ వినిపిస్తోంది.
Advertisement
ఇప్పటికే రామ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మాన్ కూతురిని సంబంధం చూసినట్లు త్వరలోనే రామ్ కూడా పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కెరీర్ లో బిజీగా ఉన్న రామ్ ఈ ఏడాది వివాహం చేసుకుంటారా లేక మరో ఏడాది వరకు ఆగుతారా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే రామ్ పోతినేని పెళ్ళికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
Ashes Series: యాషెస్ సిరీస్.. దీనికి ఎందుకంత క్రేజ్? ఎక్కువ సిరీస్లు గెలిచింది ఎవరు?
Adipurush: ఆదిపురుష్ చూడటానికి వచ్చిన హనుమాన్.. వీడియో వైరల్
Adipurush Movie Review: ఆదిపురుష్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?