హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు అందరిలో గోపీచంద్ కూడా ఒకరు. తొలివలపు సినిమాతో గోపీచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తన తదుపరి చిత్రాలైన జయం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.
Advertisement
ఆ తర్వాత హీరోగా నటించాలని ఆసక్తితో 2004లో యజ్ఞం మరియు 2005లో ఆంధ్రుడు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత అనేక విజయాలను అందుకున్నాడు హీరో గోపీచంద్. ఆ తర్వాత నుంచి హీరోగా కంటిన్యూ అయ్యాడు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్స్ అందరితో కలిసి నటించి మెప్పించాడు. ఇక రీసెంట్ గా వచ్చిన రామబాణం సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
Advertisement
ఈ ఆరడుగుల అందగాడు తన మేనకోడలు అయినటువంటి రేష్మను మే 13, 2013 లో అత్యంత ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తనకి ఇద్దరు పిల్లలు. తనకు పెళ్లి జరిగి ఇప్పటికీ 10 సంవత్సరాలు కావడంతో తన పెళ్లిరోజుని ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.