యాషెస్ సిరీస్ ను టెస్ట్ క్రికెట్ లోనే అతి పెద్ద సంగ్రామంగా పరిగణిస్తారు. దేశంతో సంబంధం లేకుండా ప్రతి అభిమాని ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠ గా చూసే సిరీస్ ఇది. క్రికెట్ గురించి తెలియని చాలామంది యాషెస్ అంటే ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ గా భావిస్తారు. కానీ ఆ రెండు దేశాలకు చెందిన అభిమానులు మాత్రం ఈ సిరీస్ ను ఓ యుద్ధంలా చూస్తారు.
Advertisement
Advertisement
ఈ సిరీస్ ను రెండుజట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఈ సిరీస్ రెండుజట్ల ఆటగాళ్లకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. చాలామందికి ఈ యాషెస్ చరిత్ర తెలియదు. యాసెస్ అనే పేరు కూడా చాలా చిత్రంగా వచ్చింది. క్రికెట్ పుట్టిన ఇల్లు ఇంగ్లాండ్ అని తెలిసిందే. అంతేకాదు క్రికెట్ తొలినాళ్లలో ఇంగ్లాండ్ దే ఆధిపత్యం. అయితే 1882లో అంటే సరిగ్గా 138 ఏళ్ల కిందట ఇంగ్లాండ్ ఆధిపత్యానికి ఆసీస్ అడ్డుకట్ట వేసింది.