టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శ్రీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మిల్కీ బ్యూటీ తమన్న. ఆ తర్వాత హ్యాపీ డే సినిమాతో మరింత చేరువైంది. అనంతరం వరుస సినిమాలు చేసుకుంటూ టాప్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ఇప్పటికే టాలీవుడ్ లోని అగ్ర హీరోలు అందరితో ఈ బ్యూటీ సినిమాలు చేసింది. అలాగే బాహుబలి లోను కనిపించి అందరిని మెప్పించింది మిల్కీ బ్యూటీ తమన్న. అయితే… గత కొన్ని రోజుల నుంచి తమన్న లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది.
Advertisement
ఈ మిల్కీ బ్యూటీ… బాలీవుడ్ నటుడు అయిన విజయ్ వర్మ ఇద్దరు ప్రేమలో ఉన్నారనీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా, కలిసి వెళ్తున్నారు. వాడికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో… ప్రచారానికి బలం చేకూరుతోంది. అయితే ఈ తరుణంలో తమన్న బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి ఇప్పుడు అందరూ సెర్చ్ చేస్తున్నారు. తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ వాస్తవానికి… బాలీవుడ్ నటుడు. కానీ అతడు తెలుగువాడని ఇప్పుడు తేలిపోయింది. అందులోనూ తెలంగాణ కు చెందిన వ్యక్తి విజయవర్మ. ఈ విషయం చాలామందికి తెలియదు.
Advertisement
1986 సంవత్సరంలోనే హైదరాబాదులో జన్మించాడు విజయ్ వర్మ. విజయ వర్మ తండ్రి క్లాత్ కు సంబంధించిన బిజినెస్ చేసేవాడు. అతని మదర్ హౌస్ వైఫ్. అలాగే విజయ వర్మకు ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు. అయితే మొదటి నుంచి విజయవర్మకు సినిమాలంటే బాగా పిచ్చి. దీంతో నటనలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకున్నాడు విజయవర్మ. అలాగే కొన్ని రోజుల కిందట థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశాడు. ఇక నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు విజయ్ వర్మ. కానీ తెలుగులో కంటే విజయవర్మకు బాలీవుడ్ లోనే క్రేజ్ ఎక్కువ. అక్కడ ఎక్కువ సినిమాలు చేశాడు.
ఇవి కూడా చదవండి :
అశ్విన్ లీలలు.. బయటపెట్టిన స్టార్ స్పిన్నర్ భార్య !
ఫోన్‌లో ఈ చిన్న రంధ్రం ఎందుకు పెట్టారు ? దీని ఉపయోగం ఏంటి ?
పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్… !