Home » టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా హీరో ?

టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా హీరో ?

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చాలామంది స్టార్ హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి… ఓ ఇంటి వారు అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య మొన్న సమ్మర్ ప్రారంభంలోనే పెళ్లి చేసుకోగా, ఇటీవల శర్వానంద్ కూడా ఓ ఇంటివాడు అయ్యాడు. ఇక మొన్న లావణ్య త్రిపాఠి తో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వీరి వివాహం ఈ ఏడాది నవంబర్ చివర్లో జరగనున్నట్లు సమాచారం అందుతుంది.

 

Advertisement

ఈ తరుణంలోనే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో మెగా హీరో అయిన సాయి ధరమ్ తేజ్ కూడా, తన బ్యాచ్ లో లైఫ్ కు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే తన గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకునేందుకు హీరో సాయి ధరంతేజ్ సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది. అయితే సాయిధరమ్ తేజ్ లవర్ ఎవరో అనుకుంటున్నారా ? ఆమె ఎవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ రెజీనా.

Advertisement

సాయి ధరంతేజ్ మరియు హీరోయిన్ రెజీనా కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమాలో రెజీనా కూడా ఆక్ట్ చేసింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వార్తలు వైరల్ కావడం గమనార్హం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇవి కూడా చదవండి :

అశ్విన్ లీలలు.. బయటపెట్టిన స్టార్ స్పిన్నర్ భార్య !

ఫోన్‌లో ఈ చిన్న రంధ్రం ఎందుకు పెట్టారు ? దీని ఉపయోగం ఏంటి ?

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్… !

Visitors Are Also Reading