యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ఆదిపురుష్. ఇప్పుడు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చాలా గ్రాండ్ గా చేశారు. ఇక ఈ ఆదిపురుష్ సినిమాలో… సీతమ్మ పాత్రలో కృతి సనన్ నటించగా రామయ్య పాత్రలో ప్రభాస్ అలరించనున్నాడు.
Advertisement
అలాగే, రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చాలా బ్రహ్మాండంగా నటించినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించనుండగా, ఈ సినిమా జూన్ 16వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలోనే ఇటీవల కాలంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతిలో జరిగింది. అయితే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఓ కీలక ప్రకటన చేసింది చిత్రం బృందం.
Advertisement
ప్రతి సినిమా థియేటర్లో ఒక సీటు హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి నిర్మాణ సంస్థ కూడా ఒప్పుకుంది. ఈ ప్రకటన రావడంతోనే… హనుమంతుడి పక్క సీటు భారీగా ధర ఉంటుందని సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్లు పెడుతున్నారు. అసలు ఆ సీటు ధర ఎంత వరకు పెంచుతారని చిత్ర బృందాన్ని అడిగారు నేటిజన్లు. అయితే ఈ విషయంపై స్వయంగా చిత్ర బృందం స్పందించింది.
దీనిపై ఈ సినిమా నిర్మాణ సంస్థ టీ సిరీస్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. ఆదిపురుష్ సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నట్లు వార్తలు వైరల్ చేస్తున్నారని… దానిపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది చిత్ర బృందం. అలాగే ప్రతి థియేటర్లో హనుమంతుడికి కేటాయించిన సీట్ పక్క సీట్లకు ఎలాంటి ధర పెంచడం లేదని.. అన్ని సీట్లు లాగే వాటి ధర కూడా ఉంటుందని కుండబద్దలు కొట్టి చెప్పింది టి సిరీస్.