చాలా మందికి ఈత కొట్టడం రాదు. పల్లె టూర్లలో ఉన్నవాళ్లు సాధారణంగా భావుల్లో ఈత నేర్చుకుంటారు. కానీ సిటీలో అయితే స్విమ్మింగ్ ఫూల్ ఫీజు కట్టడం ఈత నేర్చుకునేందుకు వెళ్లడం ఒక పని కాబట్టి పెద్దగా ఆసక్తి చూపరు. అందువల్లే ఒకప్పుడు చాలా మందికి ఈత వచ్చేది కానీ ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ టాలెంట్ ఉంటుంది. ఇక ఈత కొట్టాలంటే చేతులు కాళ్లు ఆడించాల్సి ఉంటుంది. ఎంతో కష్టపడి కాళ్లు చేతులూ కదిపితేనే ఈత కొట్టడం సాధ్యమవుతుంది.
Advertisement
Advertisement
అయితే ఓ వ్యక్తి మాత్రం ఒక చేయి పూర్తిగా లేకపోయినా…మరో చేతికి రెండే వేళ్లు ఉన్నా ఇక రెండు కాళ్లు ఉన్నా కాళ్లకు తాడు కట్టుకుని మరీ నీటిలో దిగి ఈత కొడుతున్నాడు. ఆ వ్యక్తి ఏ దేశంలోనో కాదు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ఏపీలోని భీమిలి మండలం బసవపాలెంలో శివయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఐన వాళ్లు ఎవరూ లేని శివయ్య అదే గ్రామంలో విద్యుత్తీకరణ పనులకు సహాయకుడిగా పనిచేసేవాడు. ఇక ప్రస్తుతం దాతల సహాయంతో అదే గ్రామంలో బసవేశ్వరాలయం పేరుతో శివాలయాన్ని నిర్మించి అక్కడే ఉంటున్నాడు.
ఇక శివయ్యకు ఒక చేయి పూర్తిగా లేకపోయినా ఉన్న రెండు కాళ్లకు తాడును కట్టుకుని ఈత కొడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం శివయ్య ఓ నదిలో స్నానానికి దిగిన సమయంలో ఈత రాకపోయినా పైకి తేలడం గ్రహించాడు. అప్పటి నుండి నీళ్లపై తేలుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. దాంతో ఊరంతా శివయ్యకు ఏవో శక్తులు ఉన్నాయని అనుకుంటున్నారు. అయితే ఓ వైద్యుడు మాత్రం సాధన చేస్తే ఇలా చేయవచ్చని చెబుతున్నాడు.