ఎడమ చేతివాటం కలిగిన వారి కంటే కుడి చేతివాటం కలిగిన వారే ఎక్కువగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మంది కుడి చేతివాటం కలిగిన వారు ఉంటే కేవలం 10 శాతం మాత్రమే ఎడమచేతి వాటం వాళ్ళు ఉంటారు. కుడి చేతివాటం కలిగిన వారు రాయడం, క్రికెట్ ఆడటం, బరువులు ఎత్తడం ఇలా ఏ పనికి అయినా కుడి చేతినే వాడుతారు.
Advertisement
అదేవిధంగా ఎడమ చేతివాటం కలిగిన వారు రాయడం, క్రికెట్ ఆడటం, బరువులు ఎత్తడం ఇలా ప్రతి పనికి కూడా ఎడమ చేతిని వాడుతారు. మరోవైపు ఎడమచేతి వాటం కలిగిన వారికి కుడి చేతివాటం కలిగిన వారి కంటే ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంటుందంటారు. కానీ దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది ఇలా ఉంటే కుడి చేతివాటం కలిగిన వారే ఎక్కువగా ఎందుకు ఉన్నారు…? అనేదానిపై స్వీడన్ లోని లండ్ యూనివర్సిటీ అదేవిధంగా యూకే లోని చెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. ఈ పరిశోధనలో కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చారు. స్వీయ రక్షణ విధ్వంసానికి, చేతివాటానికి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ద్వంద యుద్ధంలో ఎడమ చేతివాటం ఉన్నవారు బలంగా పోరాడగలిగినప్పటికీ ఎక్కువ శాతం వాళ్లే గాయాలపై చనిపోయారని చెప్పారు. అంతేకాకుండా గుండె ఎడమవైపు ఉంటుంది కాబట్టి యుద్ధం సమయంలో ఎడమ చేతివాటం ఉన్నవారు బలంగా ఎదుటివారిని కొట్టడానికి వీలు పడదు ఎందుకంటే గుండెపై ప్రభావం పడుతుంది.
Advertisement
అదే విధంగా కత్తి యుద్ధం సమయంలో కూడా ఎడమ చేతివాటం ఉన్నవారు పూర్తిగా తమ గుండె భాగాన్ని ప్రత్యర్థి వైపు తిప్పాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో గుండెకు గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే యుద్ద శిక్షణ ఇచ్చేటప్పుడు కుడిచేతిని వాడటం మొదలుపెట్టారట. అలా మన పూర్వీకుల నుండి అలవాటుగా మనకు కూడా కుడి చేతి వాటం అలవాటయింది అనేది ఈ సిద్ధాంతం చెబుతోంది. అయితే ఇప్పటివరకు కుడి చేతివాటం…. ఎడమ చేతివాటంపై స్పష్టమైన ఆధారాలు మాత్రం లేవు.