గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ దేవుడి దర్శనం అనంతరం మెట్లపై గుడి ముందు కూర్చుంటారు. దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయను పూజారి ఇచ్చిన ప్రసాదాన్ని తింటూ సరదాగా గడుపుతారు. మరి కొంతమంది ధర్మం, రాజకీయాలు ఇతర విషయాల గురించి చర్చిస్తారు. అయితే నిజానికి గుడి మెట్ల దగ్గర కూర్చోవడం అనేది ఒక పురాతన ఆచారం. దర్శనం తర్వాత ఎంత అర్జెంటు పని ఉన్నా గుడిమెట్ల పై కాసేపు కూర్చున్న తర్వాతే వెళ్లేవారు.
Advertisement
అయితే గుడిమెట్ల పై కూర్చున్నప్పుడు ఇతర విషయాలు చర్చించకుండా ఒక శ్లోకాన్ని చదవడం పురాతన ఆచారం. కానీ అలా ఎవరూ చేయరు. అయితే ఆ శ్లోకం చదవడం వల్ల మానసిక ప్రశాంతత తో పాటు దేవుడి అనుగ్రహం కూడా ఉంటుంది ఆ శ్లోకం ఏంటంటే…. అనాయాసేన మరణం. బినా దేన్యేన జీవనం, దేహంత్ తవ సానిధ్యం, దేహి మే పరమేశ్వరం.
Advertisement
శ్లోకం అర్థం…. అనాయాసేన మరణం అంటే …ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖంగా మరణించాలని. అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పట్టి చనిపోకుండా ఎలాంటి బాధ లేకుండా చనిపోవాలని. బినా దేన్యేన జీవనం అంటే ఒకరిపై ఆధారపడి జీవించకూడదని తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని ఇవ్వాలని అర్థం.
కొన్నిసార్లు అనారోగ్యం పాలైనా ఇతర ఇబ్బందులు వచ్చినా ఇతరులకు పై ఆధారపరాల్సి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని అర్థం. దేహంత్ తవ సానిద్యం అంటే దేవుడి సన్నిధిలో మరణించే అవకాశం ఇవ్వాలని అర్థం వస్తుంది. ఇక దేహి మే పరమేశ్వరం అంటే ఓ దేవా మాకు అలాంటి వరాన్ని ప్రసాదించు అని అర్థం వస్తుంది.
Also read:రజినీ తరవాత ఎన్టీఆర్ ఒక్కడికే సాధ్యమైన అరుదైన రికార్డు ఏంటో తెలుసా..?