Home » యాంకర్ రష్మీ..ఒక్క షోకు ఎంత తీసుకుంటుందో తెలుసా ?

యాంకర్ రష్మీ..ఒక్క షోకు ఎంత తీసుకుంటుందో తెలుసా ?

by Bunty
Ad

 

యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రష్మీ చాలా పాపులర్ అయ్యారు. సుడిగాలి సుదీర్ తో లవ్ ట్రాక్ నడిపిస్తూ అభిమానులకు మరింత చేరువయ్యారు. ఈ జంటకు కోట్లాదిమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Advertisement

కాగా, రష్మి సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాంకరింగ్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే… రష్మీ గౌతమ్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. తను ఒక్క షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక రష్మి గౌతమ్ ఒక్క షోకి 1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక సమయం దొరికినప్పుడల్లా ఆడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తూ భారీగానే సంపాదిస్తుందట ఈ అమ్మడు.

Advertisement

హైదరాబాద్ వంటి పలు నగరాల్లో కూడా భారీగానే ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. రష్మికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటారు ఆమె అభిమానులు. ఆమె పెళ్లికి సంబంధించి అనేక వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ వాటిని ఏమి పట్టించుకోకుండా రష్మీ తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. ఇక ఈ అమ్మడు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Visitors Are Also Reading