భారత క్రికెటర్ వికెట్ కీపర్ అయినటువంటి దినేష్ కార్తీక్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే దినేష్ కార్తీక్ చిరునవ్వు వెనక విషాదం మిగిలి ఉంది. అదేమిటంటే… తన భార్య, చిన్ననాటి స్నేహితుడు ఇద్దరూ కలిసి తనని మోసం చేశారు. ఈ మోసం నుంచి బయటపడటానికి తనకి ఏకంగా కొన్ని సంవత్సరాల సమయం పట్టిందట.
Advertisement
తన భార్య చేసిన మోసం కన్నా… స్నేహితుడు చేసిన మోసాన్ని దినేష్ కార్తీక్ తట్టుకోలేకపోయాడట. 2007లో తన చిన్ననాటి స్నేహితురాలైన నికిత వంజరను పెళ్లి చేసుకున్నాడట. వీరిద్దరూ చిన్ననాటి నుండి ఒకే చోట కలిసి పెరిగారు. తన భార్య నికిత వంజర… దినేష్ కార్తీక్ ను మోసం చేసి క్రికెటర్ మురళీవిజయ్ తో సంబంధాన్ని పెట్టుకుందట. తమిళనాడు జట్టుకు ఆడే మురళి విజయ్, దినేష్ కార్తీక్ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఈ స్నేహం తోనే మురళీ విజయ్ తరచూ తన ఇంటికి వస్తుండేవాడట.
Advertisement
అలా నికితకు దగ్గర అయినటువంటి మురళి విజయ్ స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. 2012లో తమిళనాడులో మ్యాచ్ ఆడుతున్న సమయంలో మురళి విజయ్ కు తన భార్యకు ఉన్న సంబంధం దినేష్ కార్తీక్ తెలిసిపోయింది. ఆ విషయం తెలిసిన వెంటనే తన భార్యకు విడాకులు ఇచ్చాడు. విడాకులు తీసుకున్న అనంతరం తన భార్య గర్భవతి అయింది. దీంతో ఆ బిడ్డకు కారణం తానే అని తెలుసుకున్న మురళి విజయ్…. నికిత వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారికి ముగ్గురు పిల్లలు. ఈ సంఘటన అనంతరం ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ శత్రువులుగా మారిపోయారు. 2018లో వీరిద్దరూ కలిసి టీం ఇండియాకు ఆడాల్సి వచ్చింది.
ఈ సిరీస్ నడుస్తున్నంత సేపు వీరిద్దరూ ఒకరికొకరు మాట్లాడించుకోలేదు. క్రీజ్ లో ఒకేసారి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కూడా వీరిద్దరూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ భారత జట్టుకు ఎంపిక కాకపోవడానికి కారణం కూడా ఇదే. ఇక 2017లో భారత స్క్వాచ్ ప్లేయర్ దీపికతో ప్రేమలో పడ్డాడు. ఒకే కోచ్ దగ్గర ఫిట్నెస్ పాఠాలు నేర్చుకుంటున్న వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.