వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సర్కార్ సినిమా టికెట్ల ధరలపై నియంత్రణ విధించడాన్ని తప్పు పడుతూ వరుస ప్రశ్నలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయిఏ ఇప్పుడు ఏపీ సర్కార్ కు సపోర్ట్ చేస్తూ వర్మపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది. శ్రీరెడ్డి మాట్లాడుతూ……సంబంధం లేనట్టు… ఏమీ పట్టించుకుకోకుండా ఉన్నట్టు కనిపిస్తూ మేధావిలా భావించే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని పేర్కొంది. తనను ఎవరైనా అంటే పట్టించుకోనట్టే ఉంటూ ఆర్జీవీ రివేంజ్ తీర్చుకుంటాడని తెలిపింది.
ఒక్కరోజు వార్తల్లో తన పేరు కనిపించకపోతే ఫీల్ అవుతాడని వ్యాఖ్యానించింది. నన్ను ఉపయోగించుకుని సురేష్ బాబు పై రివేంజ్ తీర్చుకున్నాడు అందులో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆర్జీవికి థియేటర్ల కష్టం వచ్చింది. బాలీవుడ్ లో చీ…. తూ అంటే హైదరాబాద్ ఊపుకుంటూ వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ కాంట్రవర్సిటీలు సృష్టిస్తూ ఉంటాడని… బీ గ్రేడ్ సినిమాలు బూతు సినిమాలు చేయడం తప్ప వర్మ ఏం చేశాడని ప్రశ్నించింది. అయ్యాయిలను… స్త్రీ జాతిని కించపరిచేలా మాట్లాడతాడని… అమ్మాయిల ప్రైవేటు పార్టుల గురించి మాట్లాడుతూ ఉంటాడని శ్రీరెడ్డి మండిపడింది.
Advertisement
Advertisement
alos read : శ్యామ్ సింగరాయ్ విలన్ ఎవరు..? ఇదివరకు ఏం చేసేవారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
నువ్వు ఎవరినైనా రెచ్చగొట్టుకో కానీ జగన్ ప్రభుత్వం జోలికి రావద్దు అంటూ మండిపడింది. జగన్ ప్రభుత్వాన్ని ఏమైనా అనాలంటే నన్ను దాటుకుని వెళ్లాలి అంటూ వర్మకు శ్రీరెడ్డి సవాల్ విసిరింది. నీ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నావ్..ఆర్టిస్టులకు టెక్నీషిన్లకు జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటావ్ అంటూ వర్మ పై ఆరోపణలు చేసింది. వర్మ దగ్గర పనిచేస్తే చాలని గొప్పలు చెప్పుకుంటావని… సినిమా గురించి సినిమాకు అయ్యే ఖర్చుల గురించి మాట్లాడటానికి నీకు ఏం అర్హత ఉంది అంటూ మండిపడింది. మేం ఎంతైనా ధరలు పెంచుకుంటాం ప్రభుత్వం పెత్తనం ఎందుకు అంటున్నారు…మరి కోర్టు ఎందుకు టికెట్ల ఇష్యూపై విచారణ జరిపిందని శ్రీరెడ్డి ప్రశ్నించింది.
https://m.facebook.com/story.php?story_fbid=3143125552585193&id=100044407510231