తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవాలను చాలా అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడి ఇవ్వాటికి తొమ్మిదేళ్లు గడిచి పదవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ఒక పండుగ వాతావరణం నెలకొల్పే విధంగా ఉత్సవాలను నిర్వహించడానికి కసరత్తు చేసింది. 21 రోజులపాటు రోజుకు ఒక రంగం మీద ప్రతి గ్రామ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం గైడ్లైన్స్ జారీ చేసింది. ప్రతి గ్రామంలో కల్చరల్ ప్రోగ్రామ్స్, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేసినటువంటి అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలపై ఈ ఉత్సవాలు 21 రోజుల పాటు కొనసాగానున్నాయి.
Advertisement
ఈ తరుణంలోనే ఉత్సవాలకు సంబంధించి హైదరాబాదులో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరపడానికి సన్నద్ధమవుతుంటే బీజేపీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏం సాధించారని ఉత్సవాలు జరుపుతున్నారటూ విమర్శలు చేస్తున్నారు. నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, జెండా ఆవిష్కరించారు.. ఫార్మేషన్ డే సందర్భంగా దశాబ్ది ఉత్సవాలపై పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Advertisement
ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ కూడా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అన్నారు. రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు అవుతోంది. ఈ టైంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, తెలంగాణ రాష్ట్ర బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కు నా శుభాకాంక్షలు అంటూ రాంచరణ్ స్వీట్ చేశారు.
మరి కొన్ని ముఖ్య వార్తలు:
- స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు ఎవరు…? ఆయన దొంగ గా ఎందుకు మారాడు..?
- కాంగ్రెస్ పార్టీలోకి అంబటి రాయుడు… మల్కాజ్ గిరి నుంచి పోటీ ?
- Sr NTR: ఎన్టీఆర్ చనిపోయేముందు ఆ స్టార్ హీరోకు ఫోన్ చేశారని తెలుసా ?