ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించగలిగాయి. మరి ఈనెల ఎన్ని సినిమాలు విడుదల అయ్యాయొ… వాటిలో ఏ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయే తెలుసుకుందాం.
Advertisement
మే నెల మొదటి వారంలో రామబాణం, ఉగ్రం మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా విడుదల అయిన మొదటి రోజే నెగటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాలకు పెద్దగా కలెక్షన్ రాలేదు. ఆ తర్వాత మే రెండవ వారంలో మంచి అంచనాల నడుమ కస్టడీ మూవీ విడుదల అయింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. కస్టడీ మూవీ తోనే మే రెండవ వారంలో టీ బ్రేక్, మ్యూజిక్ స్కూల్, ఫర్హానా, కళ్యాణమస్తు, భువన విజయమ్, ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ మూవీలు విడుదల కాగా ఈ సినిమాలు కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి.
Advertisement
కాకపోతే ఇదే వారంలో విడుదల అయిన డబ్బింగ్ సినిమా ది కేరళ స్టోరీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక మే మూడవ వారంలో అన్ని మంచి శకునములే సినిమా విడుదల అయ్యి అపజయాన్ని అందుకుంది. అలాగే ఇదే వారం విడుదల అయిన బిచ్చగాడు 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అలాగే ఈ వారం విడుదల అయిన హసీనా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.
ఇక మే నెల నాలుగో వారంలో మళ్లీ పెళ్లి, మేము ఫేమస్, మెన్ టూ, జైత్ర, 2018 మూవీలు విడుదల కాగా … ఇందులో మేము ఫేమస్ … డబ్బింగ్ సినిమా అయినటువంటి 2018 సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే మే నెల విడుదల అయిన సినిమాల్లో ది కేరళ స్టోరీ , బిచ్చగాడు 2 , మేము ఫేమస్ , 2018 మూవీలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.