Home » కొత్తరకం రెమ్యూనరేషన్ ప్లాన్ చేసిన శ్రీ లీల… అదేంటో తెలుసా..?

కొత్తరకం రెమ్యూనరేషన్ ప్లాన్ చేసిన శ్రీ లీల… అదేంటో తెలుసా..?

by AJAY
Ad

మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది.

Sreeleela

Advertisement

పోయిన సంవత్సరం శ్రీ లీల నటించిన ధమాకా మూవీ థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చిన్న పెద్ద అన్ని కలిపి చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీ లీల… సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలోను… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోను… రామ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న మూవీలోను… నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీలోనూ… పంజా వైష్ణవ్ తేజ్ కెరియర్లో నాలుగవ మూవీగా రూపొందుతున్న సినిమాలోను వీటితో పాటు మరిన్ని క్రేజీ మూవీలలోను హీరోయిన్గా నటిస్తోంది.

Advertisement

ఈ సినిమాలన్నింటికీ కూడా ఈ ముద్దుగుమ్మ బాగానే రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారు తెలుస్తుంది. కాక శ్రీ లీల తన పారితోషకాన్ని ఒక కొత్త రకంలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు చాలా మంది హీరోయిన్లు అంతకుముందు చేసిన సినిమాలకు ఏ రేంజ్ రెమ్యూనకేషన్ ను తీసుకున్నారో అదే రేంజ్ రెమ్యూనరేషన్ ఆ తర్వాత ఒకే సమయంలో నటిస్తున్న సినిమాలన్నింటికీ తీసుకుంటూ ఉంటారు.

కానీ శ్రీ లీల మాత్రం అలా కాకుండా 20 రోజులు అంతకంటే ఎక్కువ డేట్ లను కేటాయించిన సినిమాలకు ఒక రకం రెమ్యూనరేషన్ ను… 20 రోజుల లోపు డేట్ లను కేటాయించిన సినిమాలకు రోజువారి పద్ధతిలోనూ రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేస్ లో ముందు వరుసలో దూసుకుపోతుంది.

Visitors Are Also Reading