Home » ఆ కారణంతో బాలకృష్ణ మూవీని రిజెక్ట్ చేసిన రమ్యకృష్ణ… ఆ తర్వాత ఆమె స్థానంలో క్రేజీ నటి..!

ఆ కారణంతో బాలకృష్ణ మూవీని రిజెక్ట్ చేసిన రమ్యకృష్ణ… ఆ తర్వాత ఆమె స్థానంలో క్రేజీ నటి..!

by AJAY
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

Advertisement

ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ సరసన నటించడానికి ఎంతో మంది హీరోయిన్లు తహతహలాడిన విషయం మనకు తెలిసిందే. ఆయనతో ఒక్క సినిమా అవకాశం వస్తే చాలు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారే అవకాశాలు కూడా ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే బాలకృష్ణ సినిమాలో అవకాశం వచ్చిన కానీ ఒకే ఒక్క కారణంతో ఒక నటి ఆ సినిమాలో నటించను అని చెప్పేసిందట.

Advertisement

ఆ సినిమా ఏమిటి..? ఆ నటి ఎవరో తెలుసుకుందాం. కొంతకాలం క్రితం బాలకృష్ణ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో చెన్నకేశవరెడ్డి అనే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇందులో బాలకృష్ణ తండ్రిగాను… కొడుకుగానూ రెండు పాత్రలలోనూ నటించాడు. అందులో తండ్రి పాత్రకు జోడిగా సీనియర్ నటి టబు నటించగా… కొడుకు పాత్రకు జోడిగా శ్రేయ నటించింది.

ఇది ఇలా ఉంటే మొదట ఈ మూవీలో తండ్రి పాత్రలో నటించిన బాలయ్యకు జోడి కోసం ఈ మూవీ బృందం రమ్యకృష్ణను సంప్రదించిందట. దానితో ఈ సినిమాలో కొడుకు పాత్రకు నటించిన బాలకృష్ణ కు తల్లిగా నటించే అవసరం వస్తుంది అని… అప్పటికే సౌత్ లో టాప్ హీరోయిన్గా రమ్యకృష్ణ కొనసాగుతూ ఉండడంతో ఈ కారణంతో బాలకృష్ణ మూవీలో నటించను అని చెప్పిందట. ఆ తర్వాత ఈ మూవీ బృందం టబు సంప్రదించి… ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన బాలకృష్ణ కు జోడిగా ఎంపిక చేసుకున్నారట.

Visitors Are Also Reading