Home » బాలకృష్ణ ఈ చిత్రాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసిందా..?

బాలకృష్ణ ఈ చిత్రాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసిందా..?

by Sravanthi
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీని తారాస్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు అంటే తెలియని వారు ఉండరు. ఆయన నట వారసుడిగా బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగారు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్ లు అందుకున్నారు. అలాంటి బాలకృష్ణ నటించిన ఒక సినిమాను గవర్నమెంట్ బ్యాన్ చేసిందంట.. మరి ఎందుకు చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.. బాలకృష్ణ ఇప్పటికే వందలాది పైగా చిత్రాల్లో నటించారు. ఇందులో ఎక్కువగా సక్సెస్ అందుకున్న సినిమాలే ఉన్నాయి. అలా బాలకృష్ణ కెరియర్ లో ఒక సినిమాను ప్రభుత్వం బ్యాన్ చేసింది అన్న విషయం చాలామందికి తెలియదు..

Advertisement

Advertisement

ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే .. బాలయ్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి చిత్రం తాతమ్మకల. బాలకృష్ణ తండ్రి నందమూరి తారకరామారావు స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ రామకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, భానుమతి, బాలకృష్ణ,సాయిబాబు, చలపతిరావు కీలక రోల్ పోషించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ టైంలో కుటుంబ నియంత్రణపై విస్తృతమైన ప్రచారం సాగుతోంది. ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వస్తోంది.

అయితే ఇదే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని తీశారు. దీనిలో భాగంగానే కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ భానుమతి పాత్ర కొన్ని డైలాగులు చెప్పించారు. అయితే 1974 ఆగస్టు 30న సినిమా విడుదలకు సిద్ధమయింది. కానీ, ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రెండు నెలలపాటు సినిమాను బ్యాన్ చేసింది. ఆ తర్వాత చిత్ర యూనిట్ కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో 1975 జనవరి 8న సినిమాలు విడుదల చేశారు.
మరికొన్ని ముఖ్య వార్తలు:

 

Visitors Are Also Reading