Home » నటుడు చలపతి రావు ఉదయం 4 గంటలకే ఎన్టీఆర్ ఇంటి ముందు వెళ్లి నిల్చునే వారట ! ఎందుకంటే ?

నటుడు చలపతి రావు ఉదయం 4 గంటలకే ఎన్టీఆర్ ఇంటి ముందు వెళ్లి నిల్చునే వారట ! ఎందుకంటే ?

by AJAY
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును కలిగి ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో విజయ రంగారాజు ఒకరు. ఈయన ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Advertisement

 

ఆ ఇంటర్వ్యూలో భాగంగా సీనియర్ నందమూరి తారక రామారావు గురించి… ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా విజయ రంగరాజు గారికి ఉదయం 4 గంటలకే ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లకు నమస్కారం పెట్టేవారట… అది అవకాశాల కోసమా… లేక అభిమానంతోనా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఈయన సమాధానం ఇస్తూ … ఆయన మీద అభిమానం ఎప్పటి నుండో ఉంది.

Advertisement

నేను మాత్రమే కాదు ఎంతో మంది ఆయన కాళ్లకు పొద్దున్నే వెళ్లి నమస్కారం చేసేవారు. అలా నమస్కారం చేసుకునే అంత సంస్కారం ఉన్న వ్యక్తి ఆయన. నేను అందరికంటే ముందే నాలుగు గంటలకే ఆయన ఇంటికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించే వాడిని. నా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న చలపతిరావు గారు వచ్చే రామారావు కాళ్లకు నమస్కారం చేసి వెళ్లేవాడు. నాకంటే ముందు నుండే రామారావు గారి కాళ్ళకు నమస్కారం చేసే అలవాటు చలపతిరావు గారికి ఉంది.

నేను ఎన్నో సంవత్సరాలు ఇలా చేస్తూ ఉండడంతో ఆయనకు నా మీద అభిమానం కూడా పెరిగిపోయింది. దానితో ఆయన నటించే ఎన్నో సినిమాల్లో నాకు అవకాశాలను కూడా కల్పించాడు. అలా ఆయన సినిమాల్లో నటిస్తూ నటిస్తూ ఉండడంతో ఆయన నటించే ప్రతి సినిమాలో మాకు అవకాశాలు దొరుకుతూ ఉండేవి అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈయన చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading