సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో చూసిన సినిమా ఒకటి రెండు సార్లు రీ రిలీజ్ అవుతూ ఉంటుంది. తప్పితే మరోసారి రిలీజ్ చేయడం అనేది ఇప్పటివరకు మనం చూసింది లేదు. కానీ ఈ సినిమాలు మాత్రం 550 సార్లు రీ రిలీజ్ చేశారట మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దామా.. అదే ప్రస్తుతం పాత సినిమాలను కొత్త టెక్నాలజీ ఉపయోగించి రి రిలీజ్ చేస్తున్నారు.
Advertisement
కానీ ఈ చిత్రం మాత్రం ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ అయి చరిత్ర క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే కన్నడ మూవీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శివ రాజ్ కుమార్ నటించిన ఓం చిత్రం 1995 సంవత్సరం మే 19న మొదటిసారి థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమాను ఆ తర్వాత 550 సార్లు రిలీజ్ చేశారట.
Advertisement
దీంతో ఈ చిత్రం లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కి చరిత్ర క్రియేట్ చేసింది. ఉపేంద్ర డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రేమ చేశారు. అయితే ఈ చిత్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయట. ఉపేంద్ర కాలేజీలో చదువుకునే టైంలో ఈ సినిమా కథ రాసుకున్నారట. ఈ సినిమా కథకు శివ సినిమాకు కొన్ని దగ్గర పోలికలు ఉండటంతో కథలో కొన్ని మార్పులు చేయడం జరిగిందని, రౌడీ షీట్ లో ఉన్న కొంతమంది నటీనటులు సైతం ఈ సినిమాలో నటించడం జరిగిందని తెలుస్తోంది. రాజకుమార్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది.
మరికొన్ని ముఖ్య వార్తలు:
- ఆ రాశుల వారు జాగ్రత్త.. ఇక వారికి కష్టాలు తప్పవు..!
- తన అభిమానిని తలుచుకొని బాధపడ్డ సూర్య.. ఎందుకంటే ?
- ఆరుగురు ఎంపీలు కలిసి పని చేసిన సినిమా ఏంటో తెలుసా ?