తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో మనందరికీ తెలుసు. ఆయన ఇండస్ట్రీలో చేయని పాత్ర అంటూ లేదు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ పొజిషన్లో ఉందంటే ఎంతో కొంత కారణం ఎన్టీఆర్ అని చెప్పవచ్చు . అలాంటి ఎన్టీఆర్ సాంఘిక,జానపద,పౌరాణిక ,చారిత్రక ఇలా ఎన్నో రకాల జానార్లలో సినిమాలు చేశారు.
Advertisement
అలాంటి ఎన్టీఆర్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం కలవారు. ఇండస్ట్రీలో ఉండే చాలా మందిని బంధుత్వంతో పిలిచేవారు. పెద్దవారిని ఎంతో గౌరవించేవారు. ఇండస్ట్రీలో తొలి తరం హీరోయిన్ అయినా పుండరీబాయిని అమ్మ అంటూ సంబోధించేవారు. అంతేకాదు ఇండస్ట్రీలో మరో వ్యక్తిని కూడా నాన్న అంటూ పిలిచేవారు ఎన్టీఆర్. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే.. ఇండస్ట్రీలో తొలి తరం హీరోగా చిత్తూరు నాగయ్య ఒక వెలుగు వెలిగారు.
Advertisement
ఆయన ఎన్టీఆర్ కు గురువులా ఉండేవారు. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి నాగయ్య అంటే గౌరవంతో పాటు ఎంతో అభిమానం ఉండేది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరో అయిన తర్వాత నాగయ్యను నాన్న అంటూ పిలిచేవారట ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని విషయాలు ఈ విధంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మరి కొన్ని ముఖ్య వార్తలు :
- 60 WEDS 28.లేటు వయసులో ఘాటు ప్రేమ.. మొదటి భర్తను వదిలి మరీ..!!
- జక్కన్న వెంకటేష్ కాంబోలో రావలసిన సినిమా ఎందుకు ఆగిందో తెలుసా..?
- Bichagadu 2 Review in Telugu : బిచ్చగాడు 2 మూవీ రివ్యూ..ఇరగదీశాడుగా