Home » మహేష్ బాబు ఆ సమస్య వల్లే ఎక్కువగా ఫంక్షన్లకు రాడు..!

మహేష్ బాబు ఆ సమస్య వల్లే ఎక్కువగా ఫంక్షన్లకు రాడు..!

by AJAY
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూవీలలో హీరోగా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా మహేష్ “సర్కారు వారి పాట” అనే సినిమాలో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

Advertisement

ప్రస్తుతం మహేష్… త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్లో జరుగుతుంది. ఇదివరకే మహేష్… త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు… ఖలేజా లాంటి రెండు మూవీలు రూపొందడంతో ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రూపొందుతున్న మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

ఇది ఇలా ఉంటే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న మహేష్ తన సినిమా ఫంక్షన్లకు తప్ప మిగతా సినిమా ఫంక్షన్లకు ఎక్కువగా రాడు. ఈ మధ్య కాలంలో తన బావ అయినటువంటి సుధీర్ బాబు సినిమా ఫంక్షన్లకు అప్పుడప్పుడు వస్తున్నాడు. ఇంతకు ముందు సుధీర్ ఫంక్షన్లకు కూడా మహేష్ ఎక్కువగా వచ్చేవాడు కాదు.

ఇలా మహేష్ తన సినిమా ఫంక్షన్లకు తప్ప మిగతా ఫంక్షన్లకు రాకపోవడానికి అసలు కారణం మహేష్ కు ఉన్న సిగ్గు అనే తెలుస్తుంది. ఆ కారణంతోనే సినిమా షూటింగ్లలో పాల్గొని షూటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కువ సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తూ ఉంటాడు. అలాగే వీలు చిక్కినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి విదేశాలకి వెళ్లడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ను చూపిస్తూ ఉంటాడు.

Visitors Are Also Reading