Home » బిగ్‌బాస్‌లోని ఆ ఫీలింగ్స్‌ను బ‌య‌ట‌పెట్టిన మాన‌స్‌…

బిగ్‌బాస్‌లోని ఆ ఫీలింగ్స్‌ను బ‌య‌ట‌పెట్టిన మాన‌స్‌…

by Bunty
Ad

బిగ్‌బాస్ షో ముగిసిన త‌రువాత కూడా అందులో పాల్గొన్న కంటెస్టుల గురించి న్యూస్ వ‌స్తూనే ఉన్న‌ది. చాలా మంది కంటెస్టెంట్‌లు బిగ్‌బాస్ ద్వారా బాగా ఫేమ‌స్ అయ్యారు. ఇండస్ట్రీలో అవ‌కాశాలు ద‌క్కించుకొని ఫేమ‌స్ అవుతున్నారు. ఇంకొంద‌రు వివిధ రంగాల్లో అవ‌కాశాలు పొందుతున్నారు. ఫేమ‌స్ అయిన వ్య‌క్తులు ఎంత‌మంది ఉన్నారో బిగ్ బాస్ ద్వారా ఛీకొట్టించుకున్న జంట‌లు కూడా ఉన్నాయి.

ఇక కొంత‌మంది వ్య‌క్తులను సోష‌ల్ మీడియా జెంటిల్మెన్‌గా పేర్కొన్న‌ది. వారిలో ఒక‌రు మాన‌స్ అని చెప్పాలి. త‌న మ‌స‌నులో ఏమున్న‌దో దానిని నిర్మోహ‌మాటంగా బ‌య‌ట‌పెట్టేసేవాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న‌ప్పుడుకూడా అదేవిధంగా చేశాడు. అయితే, హౌస్‌లో ఉన్న‌ప్పుడు మాన‌స్ ప్రియాంక మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డిచింది. ప్రియాంక మాన‌స్‌ను ఇష్ట‌ప‌డింది. అయితే, మాన‌స్ ఆమెను ఎప్పుడు హ‌ద్దులు దాట‌నివ్వలేదు. ఆమె ఫీలింగ్స్‌ను హ‌ర్ట్ చేయ‌లేదు. ఇష్టం ఉన్నా లేకున్నా ఆమె ఫీలింగ్స్‌కు అనుగుణంగా న‌డుచుకున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఓ ఇంట‌ర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. ప్రియాంక బిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌చ్చిన రెండోరోజు శ్రీరామచంద్ర‌, మాన‌స్‌ల‌ను త‌ప్పించి అంద‌ర్నీ త‌న అన్న‌య్య‌లుగా భావించిందిని, ఆమె ఫీలింగ్స్‌కు గౌర‌వించి ఆమెతో అలానే న‌డుచుకున్నామ‌ని మాన‌స్ తెలిపాడు.

Advertisement

Visitors Are Also Reading