Home » నిన్ను చాలా మిస్ అవుతున్నా..సురేఖ‌వాణి ఎమోష‌న‌ల్…!

నిన్ను చాలా మిస్ అవుతున్నా..సురేఖ‌వాణి ఎమోష‌న‌ల్…!

by AJAY
Ad

టాలీవుడ్ నటి సురేఖ వాణి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖవాణి ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ మలయాళ సినిమాల్లోనూ సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా న‌టిస్తోంది. హీరోలకు అక్క, వ‌దిన, త‌ల్లి ఇలా పాత్ర ఏదైనా ఆ పాత్ర‌కు న్యాయం చేస్తుంది. కామెడీ, ఎమోషనల్ రోల్స్ లోనూ త‌న‌దైన స్టైల్ లో న‌టిస్తుండ‌టం ఆమె ప్ర‌త్యేకత‌.

Advertisement

ఇక రీసెంట్ గా సురేఖవాణి బోళా శంకర్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే సురేఖ వాణి సినిమాల కంటే సోషల్ మీడియాలో చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. సురేఖ వాణి తో పాటు ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. తల్లి కూతుళ్ల‌ మాదిరిగా కాకుండా వీళ్లిద్ద‌రూ స్నేహితుల మాదిరిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

Advertisement

ఇద్దరూ తరచూ పబ్ ల‌కు వెళుతూ మందు కొడుతున్న ఫోటోలను సైతం నెట్టింట షేర్ చేస్తూ ఉంటారు. ఇక‌ సురేఖ వాణి భర్త 2019లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత సురేఖవాణి రెండో పెళ్లి చేసుకోకుండా కూతురితోనే కలిసి సింగల్ గా ఉంటుంది. తాజాగా సురేఖ వాణి పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా ఆమె తన భర్తను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది.

భ‌ర్త ఫోటో ప‌క్క‌న కూర్చ‌న్న ఫోటోను షేర్ చేసిన సురేఖ ఆ ఫోటో కు….. నా కళ్ళల్లో ఆనందం కన్నా నువ్వు నా పక్కన లేవన్న బాధ ఎక్కువగా ఉంది. కానీ నీ ప్రేమ ఆశీర్వాదులు ఎప్పటికీ నాతోనే ఉంటాయని నాకు తెలుసు. నా ప్రతి పుట్టినరోజుకు నువ్వు చేసే హడావుడి ఇప్పటికీ నాకు గుర్తుంది. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. లవ్ యూ ఫర్ ఎఫ‌ర్ అంటూ ఎమోషనల్ అయింది. ఇదిలా ఉంటే అప్ప‌ట్లో సురేఖ‌వాణి రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. కానీ ఆ వార్త‌ల‌ను సురేఖ ఖండించింది.

ALSO READ :కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ 14 యాప్స్ నిషేధం..!

Visitors Are Also Reading