నటి అభినయ గురించి తెలియని వారు ఉండరు. శంభో శివ శంభో చిత్రంలో రవితేజకు చెల్లెలి పాత్రలో నటించి అందరి ప్రశంసలు పొందిన నటి అభినయ. అభినయ పుట్టుకతోనే చెవిటి, మూగ. వారి తల్లిదండ్రులు ఆవిడను ఎలాగైనా మాట్లాడించాలి అనే తపనతో వారి బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర కలిపి ఏకంగా 11 లక్షల వరకు ఆవిడ కోసం అప్పు తీసుకువచ్చి మరి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుండి హైదరాబాద్ కు తీసుకువచ్చారు.
Advertisement
అక్కడ అభినయకు స్పీచ్ థెరపీ క్లాసులు కూడా ఇప్పించారు. కానీ అంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ అభినయకు ఎలాంటి ఫలితం లభించలేదు. అభినయ పేరుకు తగ్గట్టుగానే తన నటనలో అభినయం ఏమాత్రం తగ్గించేది కాదు. అభినయ తన ఏడవ తరగతి లోనే ఓ తమిళ సినిమాలో ఓ చైల్డ్ యాక్టర్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
Advertisement
ఇది ఇలా ఉండగా, నాదో దిగల్ అనే సినిమా కోసం ముంబై యాక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆవిడకు తమిళ్ మాట్లాడటం కష్టం కావడంతో ఆ సినిమా నేను చేయను అని వెళ్ళిపోయింది. దీంతో ఆ సినిమా డైరెక్టర్ కోప్పడి ఎలాగైనా సరే అసలు కమ్యూనికేషన్ తెలియని హీరోయిన్ ను తీసుకువచ్చి సినిమాలో నటింపజేయాలని అనుకున్నారు. దీంతో అప్పటికప్పుడు సినిమాల్లోకి అభినయను తీసుకువచ్చి వెండితెరకు పరిచయం చేశాడు.
ఆ సినిమా భారీ హిట్ సాధించింది. ఆ ఒక్క సినిమాకు ఏకంగా 13 అవార్డ్స్ లభించాయి. ఇదే సినిమాలు తెలుగులో శంభో శివ శంభోగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కూడా హీరో రవితేజ చెల్లెలిగా నటించినది కూడా అభినయనే. ఆ తర్వాత కూడా ఈ సినిమాను కన్నడలో కూడా తెరకెక్కించారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చదవండి !