ఏపీ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది ఇంటర్మీడియట్ బోర్డు. 2023-24 ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ ను రిలీజ్ చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. మొత్తం 32 రోజుల్లో… పని దినాలు 227 రోజులని తెలిపింది. 75 రోజులు సెలవులు ఉంటాయని వెల్లడించింది. క్లాసులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది.
Advertisement
అకాడమిక్ క్యాలెండర్ కి విరుద్ధంగా ఇంటర్ కాలేజీలు పనిచేసినట్లు తెలిస్తే చర్యలు తప్పవంటూ ఇంటర్ బోర్డు హెచ్చరించింది. జులై 26 నుంచి 28 వరకు యూనిట్ 1 పరీక్షలు జరుగుతాయని, ఆగస్టు 24 నుండి 26 వరకు యూనిట్ 2 పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. సెప్టెంబర్ 16 నుండి 23 వరకు క్వార్టర్లీ ఎగ్జామ్స్, అక్టోబర్ 16 నుండి 18 వరకు యూనిట్ 3 పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
Advertisement
అక్టోబర్ 19 నుండి 25 వరకు దసరా సెలవులు ఉంటాయని, డిసెంబర్ 18 నుండి 23 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నిర్వహణ ఉంటుందని ఇంటర్ బోర్డు వెల్లడించింది. జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. జనవరి 19 నుండి 25 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని, ఫిబ్రవరి రెండో వారంలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టాలని సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం చివరి వర్కింగ్ డే 28-3-2024 అని వివరించింది. 2024 మార్చి 29 నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభమై మే 31న ముగుస్తాయని తెలిపింది.