Home » శంక‌ర్ సినిమాకు రామ్ చ‌ర‌ణ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

శంక‌ర్ సినిమాకు రామ్ చ‌ర‌ణ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

by Bunty
Ad

సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే గాసిప్స్ కు పెట్టింది పేరు. ముఖ్యంగా న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్‌ల విష‌యంలో ఎక్క‌డ‌లేని వార్త‌లు వ‌స్తుంటాయి. ప‌లానా హీరో సినిమాకు కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్నాడు. మ‌రొక హీరో అన్నీ కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్నాడు అన్న‌ట్టు వార్త‌లు వ‌స్తుంటాయి. మ‌రీ ముఖ్యంగా సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్ప‌టి నుంచి ఇలాంటి రూమ‌ర్స్ మ‌రింత ఎక్కువ‌వుతున్నాయి.

ramcharan

ramcharan

ఈ త‌రుణంలోనే తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కూడా ఇలాంటి వార్త‌లే హ‌ల్‌చ‌ల్ చేస్తూ ఉన్నాయి. చెర్రీ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య సినిమాలో న‌టిస్తున్న విష‌యం విధిత‌మే. వీటితో పాటు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా న‌టించ‌నున్నారు.

Advertisement

Advertisement

Ram charan

Ram charan

ఇదిలా ఉంటే శంక‌ర్ చిత్రం కోసం రామ్ చ‌ర‌ణ్ ఏకంగా రూ.100 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకోనున్నాడు అని వార్త‌లు తెగ సంద‌డి చేస్తూ ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌మోష‌న్‌ల‌లో ఉన్న చెర్రీ వ‌ద్ద ఈ వార్త‌ను ప్ర‌స్తావించారు కొంద‌రు. దీంతో ఈ విష‌య‌మై స్పందించిన చెర్రీ త‌న రెమ్యున‌రేష‌న్‌పై వ‌స్తున్న వార్త‌ల విష‌యంలో క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. ఆ వార్త‌లో ఎలాంటి నిజం లేద‌ని.. అవ‌న్నీ అసత్య ప్రచారాలు అని కొట్టి పారేసారు.

 

ఈ విష‌యంపై చెర్రీ తాజాగా స్పందిస్తూ..అస‌లు 100 కోట్లు ఎక్క‌డున్నాయి..? ఉన్నా నాకు ఎవ్వ‌రు ఇస్తారు..? అంటూ సింపుల్‌గా అవ‌న్నీ ఫేక్ వార్త‌లే అని తేల్చి చెప్పారు. దీంతో గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్టిన‌ట్టు అయింది. ఇదిలా ఉండ‌గా.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం జ‌న‌వ‌రి 07న విడుద‌ల‌వుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

 

 

Visitors Are Also Reading