టాలీవుడ్ లోకి కొత్తగా అడుగుపెట్టి వరుస ఆఫర్లు అందుకుంటున్న హీరోయిన్ లలో ఖిలాడి బ్యూటీ డింపుల్ హయాతి కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ అందం నటనతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. అంతేకాకుండా గ్లామర్ షో లో తగ్గేదేలే అంటూ డింపుల్ హయాతి పరువాల ప్రదర్శన చేస్తోంది. దాంతో డస్కీ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక తాజాగా డింపుల్ హయాతి గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. తాజాగా రామబాణం చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశంలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై డింపుల్ హయాతి ఒకింత అసహనం వ్యక్తం చేసింది. మీడియా సమావేశంలో ఒక్కొక్కరుగా మీడియా ప్రతినిధులు చిత్ర బృందాన్ని ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలోనే ఓ రిపోర్టర్ మాట్లాడుతూ…. ఈ మధ్య డైరెక్టర్ లు చాలామంది హీరోయిన్ ల క్యారెక్టర్ లను డిఫరెంట్ గా క్రియేట్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
కొత్త జోనర్ లు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం రొమాంటిక్ గా అనిపిస్తుంది. ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ క్యారెక్టర్ డిజైన్ ఎలా ఉంటుంది అని హీరోయిన్ ను ప్రశ్నించారు. దాంతో డింపుల్ హయాతి అసహనం వ్యక్తం చేసింది. వల్గర్ అనే పదం వినగానే హయాతి ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి.
వల్గర్ అంటారేంటి నాకు తెలిసి సినిమాలో ఎక్కడా వల్గర్ సీన్ లు చూడలేదు గ్లింప్స్ లో కూడా అలాంటివి కనిపించలేదు అనుకుంటున్నాను. మా సినిమా పాటల్లో పోస్టర్ లలో నేను శుభ్రంగానే ఉన్నాను. మీరు వల్గర్ అంటే నిజానికి నాకు అర్థం కావడం లేదు అంటూ అసహనం ప్రదర్శించింది. దాంతో డైరెక్టర్ మైక్ తీసుకుని ఈ ప్రెస్ మీట్ లో ఆమె వేసుకున్న డ్రెస్ చూస్తేనే ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో మీకు అర్థం కావాలి. ఇదొక ట్రెడిషనల్ సినిమా అంటూ ఆన్సర్ ఇచ్చారు.