Home » April 24th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 24th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్, కారుమూరి నాగేశ్వరరావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

Advertisement

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అమిత్ షా మాటలు ఉన్నాయని సీపీఐ నేత నారాయ‌ణ ఆరోపించారు. మోహన్ భగవత్ లాంటి వాళ్లే.. అందరూ కలిసి ఉండాలని అంటున్నారని.. ఇప్పుడు అమిత్ షా వచ్చి విభజన రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ నేత నారాయణ
వ్యాఖ్యానించారు.

నెల్లూరు జిల్లా నెల్లూరు నగర కార్పొరేషన్ హాల్ లో సర్వ సభ్య సమావేశం మొద‌ల‌య్యింది. పలు అంశాలను అజెండాలో పెట్టలేదని కార్పొరేటర్ లు నిరసనకు దిగారు.

ఏపీ హైకోర్టు విచారణ ముగించి తీర్పు వాయిదా వేసింది. తీర్పు జాప్యం నేపథ్యంలో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. గత సోమవారం సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించగా నేటి విచారణ జాబితాలో సీజే చేర్చారు.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జ‌ర‌గ‌నుంది. రహదారులపై రాజకీయ పార్టీల ర్యాలీలు,ధర్నాలను నిషేధిస్తూ జీవో నెంబర్ 1 జారీ చేయ‌నున్నారు. జీవోను హైకోర్టులో విప‌క్షాలు స‌వాల్ చేశాయి.

Advertisement

గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్లు ల క‌థ ముగిసిపోయింది. 10 బిల్లులలో మూడు బిల్లుల‌కు ఆమోదం తెలిపారు. రెండు రాష్ట్రపతికి.. ఒకటి తిరస్కరించ‌గా….మూడు బిల్లులపై క్లారిఫికేషన్ గవర్నర్ కోరారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. టీడీపీ వైసీపీ సవాళ్ల నేపథ్యంలో పోలీసులు ప‌లువ‌రుని అరెస్టు చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సప్లమెంటరీ ఛార్జి షీట్ ను ఈడీ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జి షీట్ లో ముగ్గురి పేర్లను ప్ర‌స్తావించారు. ఛార్జిషీట్ లో మాగుంట రాఘవరెడ్డి, రాజేష్ జోషి ,గౌతమ్ మల్హోత్రా పేర్లను ప్రస్తావించారు. సప్లిమెంటరీ ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై నేడు సీబీఐ కోర్టులో విచారణ జ‌ర‌గ‌నుంది.

ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్ రైజర్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.


వైఎస్ ష‌ర్మిల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. త‌న‌ను హౌస్ అరెస్ట్ చేయ‌డం పై ష‌ర్మిల పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా కానిస్టేబుల్ పై చేయిచేసుకున్నారు.

Visitors Are Also Reading