ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒకటి సడదించాలి అనే కోరిక ఉంటుంది. అలానే వరప్రసాద్ అనే యువకుడికి తాను హీరో అవ్వాలి అనే కోరిక కలిగింది. అదే సమయంలో ఉభయగోదావరి జిల్లాల్లో చిలకమ్మ చెప్పింది అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడకు సినిమాలు అంటే ఇష్టం ఉన్న వరప్రసాద్ చేరుకున్నారు.
Advertisement
ఏకంగా ఆ సినిమా హీరో నారాయణ రావును హీరో కావాలంటే ఏం చేయాలని అడిగారు. దాంతో ఆయన మద్రాసు వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్య్యుట్ లో జాయిన్ అవ్వలని సలహా ఇచ్చాడు.
Advertisement
ఆ సలహా తో మద్రసులో అడుగుపెట్టిన వరప్రసాద్ పునాడిరాల్లు సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతోనే వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. తన నటన డ్యాన్స్ తో ప్రేక్షకులను, దర్శకులను మెగాస్టార్ ఆశ్చర్యపరిచారు. ఆ తరవాత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ గా ఎదిగాడు. 1978 నుండి 1983 వరకు ఐదు ఎండ్లలోనే అరవై చిత్రాల్లో నటించాడు. కానీ 1994,1995 మధ్యలో మెగాస్టార్ కు వరుస ఫ్లాప్ లు వచ్చాయి. ఏ సినిమా తీసినా అది బోల్తా కొట్టడం షురూ అయ్యింది.
దాంతో 1996 లో చిరంజీవి ఆచి తూచి కథలను ఎంచుకునే ప్రక్రియలో ఆ ఏడాదే మొత్తం కాలిగానే ఉండాల్సి వచ్చింది. ఇక మళ్లీ 1997 లో మెగాస్టార్ హిట్లర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరవాత చిరు మళ్లీ వెనక్కి చూసుకోలేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారారు. ఇక ఇప్పటికీ చిరు నట ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఆయన హీరోగా నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అంతే కాకుండా మరికొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.