ప్రస్తుతం స్నాప్ చాట్, ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్స్టా గ్రామ్ ఇలా ఎక్కడ చూసినా ఎక్కవగా స్ట్రీట్ ఫుడ్ కు సంబంధించిన వీడియోలు కనిపిస్తున్నాయి. ఇక లైకుల కోసం షేర్ల కోసం కొంత మంది స్ట్రీట్ ఫుడ్ పై ప్రయోగాలను చేస్తున్నారు. వాళ్లు చేసే ఫుడ్ నోట్లోకి వెళితే ఎలా ఉంటుందో కానీ వీడియో చూస్తే మాత్రం లొట్టలు వేయాల్సిందే. అయితే తాజాగా ఓ ఫుడ్ వీడియో మాత్రం చూడ్డానికే బయమేసేలా కనిపిస్తుంది. లొట్టలు వేయడం పక్కన పెడితే ఫ్రీగా ఇచ్చినా తినలేమనిపిస్తుంది.
ఇక ఆ రెసిపీని తయారు చేసింది పిల్లలు ఎంతగానో ఇష్టపడే మ్యాగీతో..అంతే కాకుండా దానికి తందూరీ మ్యాగీ అని నామకరణం చేశారు. ఇక ఆ తందూరీ మ్యాగీని ఎలా తయారు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం….ముందుగా మట్టితో తయారు చేసిన ఒక పాత్రను తీసుకుని దానిని ఎర్రటి నిప్పుల్లో కాల్చాడు. దాంతో ఆ మట్టి పాత్ర కూడా నిప్పులా ఎరుపు రంగులోకి మారిపోయింది. ఆ తరవత కాస్త వెన్నను తీసుకుని ఆ మట్టి పాత్రకు దాన్ని అంటించాడు.
Advertisement
Advertisement
అంతే వెంటనే ఆ పాత్ర మండటం మొదలైంది. ఆ పాత్రలో పక్కనే ఉడించి పెట్టిన మ్యాగీని వేశాడు. ఆ మ్యాగీకాస్త కుతకుతలాడుతూ పైకి ఎగురుతోంది. అంతే తందూరి మ్యాగీ రెడీ అంటూ తినాలని చెబుతున్నాడు. ఇక ఈ వీడియోను యూట్యూబ్ లో అనికైత్ లూత్రా అనే యూట్యూబ్ చానల్ షేర్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 32లక్షలకు పైగా వ్యూవ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ వీడియో మాత్రం ఫుడ్ లవర్స్ కు నచ్చడం లేదు. ఇదేం మ్యాగీరా అంటూ రిప్ మ్యాగీ అని కామెంట్లు చేస్తున్నారు.