టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు ఊహించని షాక్ తగిలింది. దర్శకుడు సుకుమార్ ఇంట్లో అధికారులు ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. సుకుమార్ జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలతోనే ఆయన ఇంటి పై అధికారులు రైట్స్ నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. సుకుమార్ ఇంటితో పాటూ మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
Advertisement
మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ వివిద రూపాలలో 700 కోట్ల రూపాయల నగదను మార్చుకుని జీఎస్టీ ఎగొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక సుకుమార్ మరియు మైత్రీ మూవీస్ ఆఫీస్ లలో ఏక కాలంలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో పుష్ట సినిమా షూటింగ్ సైతం రద్దైనట్టు తెలుస్తోంది. పుష్ప సినిమా హిట్ అవ్వడంతో ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 తెరెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సిసినమాకు సుకుమార్ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు.
Advertisement
అంతే కాకుండా సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన రంగస్థలం సినిమాను కూడా మైత్రీమేకర్స్ వారే నిర్మించారు. ఈ సినిమాలతో పాటూ ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలను కూడా నిర్మించారు. అంతే కాకుండా ఫ్యూచర్ లోనూ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నట్టు ఇప్పటికే మైత్రీ వారు ప్రకటించారు. అయితే ఇలాంటి సమయంలో ఐటీ దాడులు జరగటం వారికి ఊహించని షాక్ గానే మారింది. మరి ఐటీ అధికారులు సుకుమార్ మరియు మైత్రీ మూవీమేకర్స్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
ALSO READ :పట్టుమని పాతికేళ్లు నిండకుండానే పెళ్లి చేసుకున్న 10 మంది స్టార్ హీరోయిన్ లు వీళ్లే..!