ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. ఎట్టకేలకు టాపార్డర్ బ్యాటర్లు మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ శర్మ అనారోగ్యం కారణంగా ఆదివారం సాయంత్రం వాంకడే స్టేడియంలో కోల్కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ కు సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించాడు. ఐపీఎల్ లో కెప్టెన్ గా తన తొలి మ్యాచ్లో జట్టుకు ఘనవిజయం అందించారు.
read also : ఇంత మంది హీరోయిన్లతో సిద్ధార్థ్ ఎఫైర్ పెట్టుకున్నాడా ?
Advertisement
కానీ, తొలిపోరులోనే అతను జరిమానా ఎదుర్కొన్నాడు. అతనితోపాటు కేకేఆర్ కెప్టెన్ నితీష్ రానాపై కూడా జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సూర్యకు మ్యాచ్ రిఫరీ రూ. 12 లక్షలు జరిమానా వేశాడు. నిర్నీత సమయంలో 21 పూర్తి చేయకపోవడంతో అతనిపై చర్యలు తీసుకున్నాడు. మరోవైపు ముంబై బౌలర్ హృతిక్ షోకిన్ వేసిన తొమ్మిదో ఓవర్ తొలి బంతికి క్యాచ్ ఇచ్చి నితీష్ రానా అవుటయ్యాడు.
Advertisement
ఆ సమయంలో సంబరాలు చేసుకుంటున్న షోకిన్ పై రానా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. షోకిన్ కూడా వదలివ్వడంతో అతనిపైకి దూసుకెళ్లాడు. సూర్య కుమార్ వచ్చి ఈ ఇద్దరినీ విడదీశారు. ఢిల్లీ రంజీ జట్టుకు ఆడుతున్న రానా షోకిన్ కు ముందు నుంచి పడదు. అయితే రానా, షోకిన్ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు మ్యాచ్ రిఫరీ నిర్ధారించాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 నేరానికి పాల్పడినట్టు తేల్చి రానా మ్యాచ్ ఫీజులో 25% కోత విధించాడు. షోకిన్ కు మ్యాచ్ ఫీజులో 10% కోత పెట్టాడు.
read also : “విక్రమార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!