ఐపీఎల్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. గెలుస్తాయి అనుకున్న జట్టు ఓడిపోతూ, ఓడిపోతాయి అనుకున్న జట్లు గెలుస్తూ ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను పంచుతోంది ఈసారి ఐపీఎల్. ఇది ఇలా ఉండగా, ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ తన చర్యతో నెటిజన్ల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సిబితో జరిగిన మ్యాచ్ లో ఒక్క వికెట్ తేడాతో లక్నో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
read also : వామ్మో.. 5 అంగుళాల పొడవు కోసం రూ.1.35 కోట్లు ఖర్చు..!
Advertisement
అయితే ఆఖరి బంతికి లక్నో విజయానికి ఒక్క పరుగు అవసరం అయ్యింది. హర్షల్ వేసిన ఆఖరి బంతిని వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అందుకోవడంలో విఫలం కావడంతో ఆవేష్, బిష్నోయ్ బై రూపంలో పరుగు తీసి లక్నోకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆఖరి బంతికి విజయం సాధించగానే లక్నో డగౌట్ సంబరాల్లో మునిగి తేలిపోయింది. అయితే విన్నింగ్ సెలబ్రేషన్స్ జరుపుకునే క్రమంలో ఆవేష్ ఖాన్ హద్దులు మితిమీరాడు. ఆకరి బంతికి పరుగు తీసిన వెంటనే ఆవేష్ తన హెల్మెట్ ను నేలకేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
read also : IPL 2023 : గంగూలీని దారుణంగా అవమానించిన కోహ్లీ..వీడియో వైరల్
Advertisement
అయితే….ఈ సన్నివేశాన్ని ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కూడా తమకు తగ్గట్టుగా వాడేసుకున్నారు. “మైదానంలో ఆడే క్రికెట్ అయినా…. రోడ్డుపై నడిపే ద్విచక్ర వాహనమైన… శిరస్సుకి హెల్మెట్ ధరించడం ఎల్లవేళలా సురక్షితం. మన విలువైన ప్రాణాలు కాపాడే హెల్మెట్ ని గౌరవిద్దాం… సురక్షిత ప్రయాణానికి నాంది పలుకుదాం” అంటూ ట్విట్టర్ లో ఆవేశ్ ఖాన్ ఆవేశపు వీడియోను జతచేస్తూ… ఈ సందేశాన్ని ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. ఇది ఓవైపు… ఆవేశ్ ఖాన్ చేసిన పనికి సెటైర్ వేస్తూనే… యువతకు హెల్మెట్ మీద అవగాహన కల్పించినట్లు అయింది. ఇప్పుడు ఈ ట్వీట్ కూడా వైరల్ గా మారింది.
మైదానంలో ఆడే క్రికెటైనా.. రోడ్డుపై నడిపే ద్విచక్ర వాహనమైనా.. శిరస్సుకి హెల్మెట్ ధరించడం ఎల్లవేళలా సురక్షితం.
మన విలువైన ప్రాణాలు కాపాడే హెల్మెట్ ని గౌరవిద్దాం.. సురక్షిత ప్రయాణానికి నాంది పలుకుదాం.#AwarenessOnRoadSafety #RespectHelmet#HelmetSavesLife #RoadSafety pic.twitter.com/TgGgPM9xDy— Hyderabad City Police (@hydcitypolice) April 15, 2023