ఐపీఎల్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. గెలుస్తాయి అనుకున్న జట్టు ఓడిపోతూ, ఓడిపోతాయి అనుకున్న జట్లు గెలుస్తూ ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను పంచుతోంది ఈసారి ఐపీఎల్. ఇది ఇలా ఉండగా, ఇండియా మాజీ సారధి ధోని గురించి తెలియని వారుండరు. ధోని నాయకత్వంలో జట్టు చాలా రోజులుగా ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్ తో పాటు టి20 వరల్డ్ కప్ ను కూడా ఒడిసిపట్టింది. టెస్టుల్లోను నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
read also: మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టిన ఈ ఫేమస్ హీరోయిన్…ఎవరో తెలుసా ?
Advertisement
అయితే 2019 ప్రపంచ కప్ ఓటమి తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు మాహి గుడ్ బై చెప్పేసాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడనప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అభిమానులకు వినోదాన్ని పంచుతూనే ఉన్నాడు. కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ ను ముందుండి నడిపిస్తూనే, హిట్టర్ గా జట్టుకు విజయాలను చేకూరుస్తున్నాడు. అయితే వయసు పెరుగుతున్న నేపథ్యంలో అతడి ఐపిఎల్ రిటైర్మెంట్ మీద కూడా చర్చ మొదలైంది. ఐపీఎల్ కు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడో ధోని స్పష్టంగా చెప్పలేదు.
Advertisement
READ ALSO : IPL 2023 : ‘చెంప చెల్లుమంటుంది’.. గిల్ కు సెహ్వాగ్ వార్నింగ్
అయితే తాను హోం గ్రౌండ్ గా భావించే చెన్నైలో చివరి మ్యాచ్ ఆడతనని మాత్రం ఒక సందర్భంలో అన్నాడు. ఇదిలా ఉండగా, ధోని రిటైర్మెంట్ పై సిఎస్కే మాజీ ప్లేయర్ టీమిండియా బ్యాటర్ కేదార్ జాదవ్ ఆసక్తికర కామెంట్ చేశాడు. ధోనికి వయసు పెరుగుతోందని, అతనిపై ఒత్తిడి ఎక్కువవుతోందని జాదవ్ తెలిపాడు. ఇకమీదట క్రికెట్ ఆడేందుకు అతడి శరీరం సహకరించకపోవచ్చున న్నాడు. బహుశా ఇదే అతడికి ఆఖరి ఐపీఎల్ కావచ్చని జాదవ్ పేర్కొన్నాడు.
read also : IPL 2023 : గంగూలీని దారుణంగా అవమానించిన కోహ్లీ..వీడియో వైరల్