నోబెల్ రికార్డు సాధించడం అంత ఈజీ కాదు. చాలా మంది నోబెల్ రికార్డు సృష్టించేందుకు ఎంతో శ్రమిస్తారు. కొంతమంది జీవిత లక్ష్యం నోబెల్ రికార్డు అయినా ఎంతో కష్టపడ్డా సాధించలేకపోతారు. అయితే తాజాగా ఓ చిన్నారి పది నెలలకే నోబెల్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఆ చిన్నారి కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కడపకు చెందిన చిన్నారి కావడం గర్వించదగ్గ విషయం. ఆ చిన్నారి పేరు వినిశ వయసు చిన్నదే…. సైజు బడ్డదే కానీ తెలివి మాత్రం చాలా పెద్దది. అందుకే నోబెల్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.
Advertisement
వినిష వయసు కేవలం పది నెలలు మాత్రమే అయినా వరల్డ్ యంగెస్ట్ మల్టీ టాలెంటెడ్ కిడ్ గా నిలిచింది. అంత చిన్న వయసులోనే వినిష ముప్పై పద్యాలు….సోలార్ సిస్టమ్, వారాలు మరియు నెలల పేర్లు చెబుతోంది. అంతే కాకుండా 50 జికే ప్రశ్నలకు వినిష తడబడకుండా ఆన్సర్ లు చెబుతోంది. ఇక గతంలో తన టాలెంట్ తో ఈ బడ్డది ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, కలాం వరల్డ్ రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఏడాది నిండ కుండానే ఇన్ని ఘనతలు సాధించిన వినిష జీవితంలో మరిన్ని విజయాలను సాధించాలని ఆశిద్దాం.
Advertisement