కొత్తకార్ లో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేయడం క్యాన్సర్ ను కొనితెచ్చుకోవడమే అంటున్నారు శాస్త్రజ్ఞులు. కొత్త కార్ నుండి వచ్చే వాసన చాలా ప్రమాదకరమైనది ఆ కార్ లో లాంగ్ డ్రైవ్ పక్కన పెడితే కేవలం 20 నిమిషాల పాటు డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదకర పరిమాణాలకు దారితీయొచ్చంటున్నారు. ఈ విషయంపై ఆధ్యయనం చేసిన హార్వర్డ్ యూనివర్శిటీ మరియు చైనాలోని బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ విషయాన్ని తెలియజేశారు.
Advertisement
12 రోజుల పాటు ప్యాక్ చేయబడి , బయట ఉంచబడిన కార్ కు కొన్ని సెన్సార్లను అమర్చి ఆ కార్ నుండి వెలువడే హనికర రసాయనాలను, గాలి నాణ్యతను పరిశోధించిన శాస్త్రజ్ఞులు మానవ క్యాన్సర్ కారక ఎసిటాల్డిహైడ్ 60.5% స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు. అస్థిర కార్బన్ కాంపౌడ్స్ ఆ వాసనకు కారణంగా గుర్తించారు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కార్బన్ సమ్మేళనాల సాంద్రత పెరిగే కార్ లోపలి గాలి నాణ్యత మరింతగా క్షీణిస్తుందని తెలిపారు.
Advertisement
కొత్త కార్ లో రంగులేని, మండే స్వభావం కలిగి, బలమైన వాసన కలిగిన ఫార్మాల్డిహైడ్ కూడా విడుదల అవుతుంది. ఇది సాధారణంగా టెక్స్‌టైల్స్, పెయింట్స్ లతో పాటు గృహోపకరణాలకు వాడే అనేక వస్తువులలో ఉంటుంది. ప్రాథమిక రంగులు, పాలిస్టర్ రెసిన్ ల తయారీలో ఇతర రసాయనాల సంశ్లేషణలో మధ్యస్థంగా ఎసిటాల్డిహైడ్ ను వాడతారు. ఇది క్యాన్సర్ కు కారణం.