పోసాని కృష్ణ మురళి టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. పోసాని ఒకప్పుడు డైరెక్టర్ మంచి హిట్ లు అందుకున్నాడు. అంతకముందు కథా రచయితగా పనిచేశాడు. డిఫరెంట్ సినిమా ల తో పోసాని ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మెంటల్ కృష్ణ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి నటుడు గా కూడా ప్రశంసలు అందుకున్నాడు.
READ ALSO : CSK ఫ్యాన్స్ కు షాక్..IPL 2023 నుంచి ధోని ఔట్ ?
Advertisement
ఆ తరవాత స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు అందుకుని బిజీ నటుడు గా మారిపోయాడు. అంతే కాకుండా పోసాని రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నాడు. అయితే.. తాజాగా పోసాని కృష్ణ మురళి మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ కోసం పూణే వెళ్లిన పోసాని గురువారం హైదరాబాద్ కు వచ్చారు.
Advertisement
READ ALSO : Shaakuntalam review : శాకుంతలం రివ్యూ.. సమంత ఖాతాలో భారీ డిజాస్టర్ ?
అయితే ఒంట్లో కాస్త నలతగా ఉండడంతో పాటు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కాగా, ఆయన మహమ్మరి బారిన పడడం ఇది మూడోసారి. ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా, దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పోసాని. రాజకీయాల్లోనూ అడుగు పెట్టి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
read also : ఆ ఒక్క సినిమాతో సిల్క్ స్మిత అప్పుల పాలయ్యారా? తాను చేసిన అప్పులు ఎవరు చెల్లించారంటే?