Shaakuntalam Movie Review: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ నుంచి కోలుకున్నాక ఇప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. యశోద సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సోషియో ఫాంటసీగా తెరకెక్కించారు గుణశేఖర్. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం శాకుంతలం.
Advertisement
Shaakuntalam Story in Teluguకథ మరియు వివరణ
శాకుంతలం సినిమా కథ విషయాల్లోకి వెళితే.. శాకుంత పక్షులు ఓ పసిబిడ్డని తీసుకుని ఓ చోట విడిచిపెడతాయి. అక్కడికి దగ్గరలో కన్వముని (కృష్ణంరాజు) ఆశ్రమం ఉంటుంది. అలా ఆ ముని ఆ పాపని పెంచి పెద్ద చేస్తారు. శకుంతల (సమంత) అని పేరు కూడా పెడతారు. ఓ రోజు పులుల్ని వేటాడుతూ దుష్యంత (దేవ్ మోహన్) రాజు ఆశ్రమానికి వస్తాడు. అక్కడ శకుంతలని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ తర్వాత శకుంతల కూడా దుష్యంతుడిని ఇష్టపడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? శకుంతల, దుష్యంతుడు చివరకు ఒకటయ్యారా? లేదా? అనే తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
Advertisement
ఇంద్రుడి ప్లాన్ లో భాగంగా మేనక భూమిపైకి వచ్చి విశ్వామిత్రుడి తపస్సు భంగం కలిగించడంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత విశ్వామిత్రుడు, మేనక ప్రేమించుకోవడం, శారీరకంగా కలవడంతో శకుంతల జన్మకు కారణం అవుతుంది. ఇలా మేనక ఎపిసోడ్ ను ఎక్కువగా సాగదీయకుండా శకుంతల, దుష్యంతుడిని కథలోకి దర్శకుడు వెళ్లడంతో కొంత ఆసక్తి కనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో పెద్దగా ఎమోషన్స్ పండకపోవడం, సాదాసీదాగా కథ సాగడం కొంత రొటీన్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కథలో వేగం కనిపించకపోవడంతో ప్రేక్షకుడు సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచేలా చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో శకుంతల అసలు కథ మొదలవుతుంది. ప్రకాష్ రాజ్ ఎంట్రీ తో సముద్ర ప్రయాణం కథకు కీలకంగా మారుతుంది. దుష్యంతుడి సభలోకి వెళ్లి శకుంతల భంగపాటుకు గురి కావడంతో కథలో కొంత చలనం వస్తుంది. అయితే చాలా ఆర్టిఫిషియల్ గా సన్నివేశాలు కనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్:
సమంత
గుణశేఖర్ డైరెక్షన్
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ లాజిక్స్ మిస్
గ్రాఫిక్స్ తేలిపోవడం
ఒకే ఒకే అనిపించే సాంగ్స్
బోర్ కొట్టించే చాలా సీన్స్
రేటింగ్: 2/5