రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం అభిమానులను అలరించాడు. తలైవా ట్రేడ్ మార్క్ షాట్లకు చెపాక్ మైదానం దద్దరిల్లిపోయింది. ధోని ఆఖరి వరకు క్రిజులో ఉన్నప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్ లో సీఎస్కే 21 పరుగులు అవసరం అవ్వగా, ధోని రెండు సిక్సులు బాదినప్పటికీ విజయం మాత్రం రాజస్థాన్ వైపే నిలిచింది.
read also : ఆ ఒక్క సినిమాతో సిల్క్ స్మిత అప్పుల పాలయ్యారా? తాను చేసిన అప్పులు ఎవరు చెల్లించారంటే?
Advertisement
ఈ మ్యాచ్ లో కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మిస్టర్ కూల్… ఒక్క ఫోర్, మూడు సిక్సర్లతో 32 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. ఇక ఇది ఇలా ఉండగా, ధోని బ్యాటింగ్ కు రాగానే డిజిటల్ బ్రాడ్ కాస్టర్ జియో సినిమా వ్యూస్ రెండు కోట్ల మార్కును దాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్సులు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇదే జియో సినిమాకు ఆల్ టైం రికార్డ్ కావడం గమనార్ధం.
Advertisement
READ ALSO : Chiranjeevi : చిరంజీవి మామూలోడు కాదు… మోజు పడిన మూడు రాత్రుల్లకే!
అంతకు ముందు లక్నో సూపర్ జేయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని కొట్టిన రెండు సిక్సర్లను లైవ్ లో ఏకకాలంలో 1.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా, తాజా మ్యాచ్ తో ఈ రికార్డు బద్దలు అయింది. ఇక అటు రాజస్థాన్ కెప్టెన్ సంజు కు రూ. 12 లక్షలు ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు కు రూ. 12 లక్షలు ఫైన్ పడింది.
Read ALSO : Richest Cm Jagan : దేశంలోనే సంపన్నుడైన సిఎం జగన్..కేసీఆర్ ర్యాంక్ ఎంతంటే…?