సోషల్ మీడియాలో కొంతమంది పవన్ ఫ్యాన్స్ మరియు రేణూదేశాయ్ ల మధ్య వివాదం ముదురుతోంది. కొంతమంది తనను ఇబ్బంది పెడుతున్నారని రేణూదేశాయ్ సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లతో ఫైర్ అవుతోంది. ఇటీవల పవన్ రేణూదేశాయ్ ల కుమారుడి పుట్టినరోజు జరిగింది. దాంతో పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు మా అన్న కొడుకును సరిగ్గా చూపించండి మేడమ్.
Advertisement
మా అన్న కొడుకును చూడాలని మాకు ఆశ ఉండదా అంటూ కామెంట్ పెడ్డాడు. దాంతో రేణూదేశాయ్ మండిపడుతూ అభిమానికి రిప్లై ఇచ్చింది. మీ అన్న కొడుకా….అకిరా నా కొడుకు ముందు పద్దతిగా మాట్లాడటం నేర్చుకో…ఒక తల్లికే పుట్టావా..? అంటూ ఫైర్ అయ్యింది. అంతే కాకుండా ఆ తరవాత ఓ యాక్టివిస్ట్ రేణూదేశాయ్ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో క్లిప్ ను షేర్ చేసింది.
Advertisement
ఆ వీడియోలో రేణూ దేశాయ్ లాంటి సెలబ్రెటీలు సైతం విడాకులు తీసుకున్న తరవాత ఇబ్బందుకు పడుతున్నారని ఈ సమాజం కేవలం స్త్రీలను మాత్రమే దోషులుగా చూస్తుందని వ్యాఖ్యానించింది. ఇక ఆ వీడియోను షేర్ చేసిన రేణూదేశాయ్ ..ఈవిడ ఎవరో తెలియదు కానీ నా కోసమే మాట్లాడినట్టు అనిపించింది అంటూ పేర్కొంది.
ఇక రేణూ చేసిన కామెంట్ లతో కొంతమంది పవన్ కల్యాణ్ అభిమానులు ఆమెకు క్షమాపణలు చెబుతుంటే మరికొందరు మాత్రం ఆమెకు మరింత కోపం తెప్పిస్తున్నారు. ఓ అభిమాని రేణూదేశాయ్ తో మీరు కామెంట్ లు ఆఫ్ చేసుకోండి…మెసేజ్ లకు ప్రైవసీ పెట్టుకోండి అంటూ సలహా ఇచ్చారు. ఆ కామెంట్ పై రేణూ దేశాయ్ స్పందించారు. మీరు చెప్పినట్టు జీవించడానికి నేను ఎమైనా తప్పు చేశానా..? సమాజంలో ఇదే సమస్య..సలహా ఇవ్వడం తేలిక కానీ అనుభవించేవారి ఆ బాధ తెలుస్తుంది. అంటూ తన స్టోరీలో పేర్కొంది.
ALSO READ : Samantha : మళ్లీ అనారోగ్యం బారిన సమంత..ఆస్పత్రికి తరలింపు ?