మెగా డాటర్ నిహారిక కొనిదెల విడాకులు తీసుకోబోతున్నట్టు కొంతకాలంగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం నిహారిక భర్త తన సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫోటోలను మరియ కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేయడమే. అంతే కాకుండా సోషల్ మీడియాలో చైతన్య నిహారిక ను అన్ ఫాలో చేశారు కూడా. కాగా ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. నిహారిక కూడా తన సోషల్ మీడియాలో భర్తనుఅన్ ఫాలో చేసింది.
ALSO READ :మరోసారి రెచ్చిపోయిన సమంత…చైతూను ఉద్దేశించే ఆ కామెంట్స్ చేసిందా..?
Advertisement
అంతే కాకుండా తమ పెళ్లి ఫోటోలను మరియు భర్త ఫోటోలను డిలీట్ చేసింది. కేవలం తన తల్లితో దిగిన ఫోటో తప్ప మిగతా పెళ్లి ఫోటోలు అన్నింటిని నిహారిక డిలీట్ చేసింది. నిహారిక అలా చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినటవుతోంది. నిహారిక చైతన్య జంట కచ్చితంగా విడాకులు తీసుకుంటారంటూ నెటిజన్ లు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
అయితే మెగా అభిమానులు అలా జరగకూడని నిహారిక చైతన్య కలిసి ఉండాలని కోరుకుంటూ అటు నిహారిక ఫోటోలకు ఇటు చైతన్య ఫోటోలకు కామెంట్ లు పెడుతున్నారు. మరోవైపు నిహారిక ఈ వార్తలను పట్టించుకోకుండా సొంతంగా ఓ ఆఫీస్ ను కూడా ప్రారంభించారు.
అంతే కాకుండా రీసెంట్ గా ఫోటో షూట్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో నిహారిక మళ్లీ సినిమాలను నిర్మించడంతో పాటూ సినిమాల్లో నటిస్తారు అని కూడా ప్రచారం మొదలయ్యింది. మరి నిహారిక చైతన్యల విడాకుల వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.
ALSO READ : దర్శకుడు రాఘవేంద్రరావుపై పోసాని సెన్షేషనల్ కామెంట్స్ !