Home » సిల్క్ స్మిత అప్పుల బాధ‌తో చ‌నిపోలేదా…? మ‌త్తుక‌ళ్ల‌ సుంద‌రి మ‌ర‌ణానికి అస‌లు కార‌ణం ఏంటి..?

సిల్క్ స్మిత అప్పుల బాధ‌తో చ‌నిపోలేదా…? మ‌త్తుక‌ళ్ల‌ సుంద‌రి మ‌ర‌ణానికి అస‌లు కార‌ణం ఏంటి..?

by AJAY
Ad

సిల్క్ స్మిత ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. రీసెంట్ గా నాని హీరోగా న‌టించిన ద‌స‌రా సినిమా ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో సిల్క్ స్మిత పేరు ఎక్కువ‌గా వినిపించింది. ఈ కాలంలో సినిమాల‌లో కూడా సిల్క్ పేరు వినిపిస్తుంది అంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. అప్ప‌ట్లో స్టార్ హీరోలు సైతం సిల్క్ డేట్స్ కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అయితే సిల్క్ మ‌ర‌ణం వెన‌క దాగి ఉన్న నిజం ఎవ్వ‌రికీ తెలియ‌దు.

ALSO READ : దసరా నుండి డిలీట్ చేసిన సీన్లు అంత దారుణంగా ఉన్నాయా..?

Advertisement

అంతే కాకుండా సిల్క్ మ‌ర‌ణానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు వార్త‌ల్లో వినిపిస్తుంటాయి. అందులో అప్పుల బాధ‌తోనే సిల్క్ ఆత్మ‌హ‌* చేసుకుంది అనేది కూడా ఒక రూమ‌ర్. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నటి కాకినాడ శ్యామ‌ల సిల్క్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. అప్ప‌ట్లో తాను చాలా సినిమాల‌కు ఫైనాన్షియ‌ర్ గా వ్య‌వ‌హ‌రించాన‌ని శ్యామ‌ల చెప్పింది.

Advertisement

సిల్క్ స్మిత నిర్మించిన సినిమాల‌కు కూడా తాను ఫైనాన్షియ‌ర్ గా చేశానని తెలిపింది. సిల్క్ సినిమాలు స‌రిగా ఆడ‌క‌పోవ‌డం వ‌ల్ల అప్పుల పాలు అయ్యింద‌ని చెప్పింది. అలా అని ఎవ్వరికీ డ‌బ్బులు ఎగొట్ట‌లేద‌ని ఆ త‌ర‌వాత కెరీర్ గాడిన ప‌డ‌టంతో ఆ అప్పులు అన్నీ తీర్చేసింద‌ని చెప్పింది.

సిల్క్ వ్య‌క్తిత్వం చాలా గొప్ప‌ద‌ని ఆమె తెర‌పై చేసిన పాత్ర‌లు వేరు బ‌య‌ట మ‌న‌కు క‌నిపించే మ‌నిషి వేర‌ని చెప్పింది. సిల్క్ చాలా గొప్ప వ్య‌క్తి అని శ్యామ‌ల అభిప్రాయ‌ప‌డింది. అంతే కాకుండా ఆమె ఆత్మ‌హ‌* చేసుకుంద‌ని కొంత‌మంది హ‌* చేశార‌ని కొంత‌మంది చెబుతుంటార‌ని అస‌లు నిజం ఆ దేవుడికే తెలియాల‌ని కామెంట్ చేసింది.

ALSO READ : నంది అవార్డులపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading