Home » స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డం అల‌వాటైపోయింది…మ‌రోసారి స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డం అల‌వాటైపోయింది…మ‌రోసారి స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం శాకుంతలం అనే సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా ఎప్రిల్ 14న విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఇక సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర‌యూనిట్ వ‌ర‌స ప్ర‌మోష‌న్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇప్ప‌టికే స‌మంత ప‌లు ఇంట‌ర్వ్యూలలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. కాగా ఇంట‌ర్వ్యూల‌లో ఎక్కువ‌గా స‌మంత ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన ప్ర‌శ్న‌లే ఎదురౌతున్నాయి.

Advertisement

దానికి కార‌ణం స‌మంత ఇటీవ‌లే విడాకులు తీసుకోవ‌డంతో పాటూ అనారోగ్యం భారిన ప‌డ‌టం కూడా ఒక కార‌ణం. ఇక స‌మంత కూడా ఇంట‌ర్వ్యూల‌లో ఎదుర‌య్యే ప్ర‌శ్న‌లకు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెబుతోంది. ఇక తాజాగా స‌మంత శాకుంత‌లం సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగానే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. కాగా ఆ ఇంట‌ర్వ్యూలో స‌మంత మాట్లాడుతూ…

Advertisement

నేను చిన్న‌నాటి నుండి డిస్నీజోన‌ర్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డేదానిన‌ని తెలిపింది. ఆనందంగా ఉన్నా బాధ‌లో ఉన్నా వాటినే చూసేదాన్ని అని చెప్పింది. ఇక శాకుంత‌లం లో యువ‌రాణి పాత్ర‌లో న‌టించాన‌ని చెప్పింది. అయితే ఆ పాత్ర‌లో న‌టించడానికి మొద‌ట బ‌య‌ప‌డ్డాన‌ని చెప్పింది.

కానీ కొంత‌కాలంగా స‌వాళ్లు స్వీక‌రించ‌డం అలవాటు అయింద‌ని అందుకే ఓకే చెప్పాన‌ని తెలిపింది. అంతే కాకుండా పాన్ ఇండియా స్టార్ అయ్యాక జీవితం ఎలా ఉంద‌ని ప్ర‌శ్నించ‌గా తాను కేవ‌లం ఆరు గంట‌లు మాత్రమే స్టార్ అని చెప్పింది. జీవితంలో ఎలాంటి మార్పు రాలేద‌ని అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంద‌ని కానీ కొత్త పాత్ర‌లు రావ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పింది.

Visitors Are Also Reading