Home » బాస్మ‌తి బియ్యం ఆరోగ్యానికి మంచిదేనా…? రోజూ తింటే ఏం జ‌రుగుతుందంటే..?

బాస్మ‌తి బియ్యం ఆరోగ్యానికి మంచిదేనా…? రోజూ తింటే ఏం జ‌రుగుతుందంటే..?

by AJAY
Ad

ద‌క్షిణాది ప్ర‌జలు ఎక్కువ‌గా అన్నం తింటూ ఉంటారు. ప్ర‌తిరోజూ ఒక్క పూట అయినా భోజనం చేయ‌నిదే క‌డుపునిండ‌దు. అయితే బియ్యంలో చాలా ర‌కాలు ఉన్నాయి. అందులో బాస్మ‌తి బియ్యం కూడా ఒక ర‌కం. బాస్మ‌తి బియ్యం తిన‌డానికి ఎంతో ఇష్ట‌ప‌డుతుంటారు. దానికి కార‌ణం బాస్మ‌తి బియ్యం సువాస‌న రావ‌డంతో పాటూ తిన‌డానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. అంతే కాకుండా పొడ‌వుగా స‌న్న‌గా ఉంటాయి.

Advertisement

ముఖ్యంగా బిర్యానీలు, పులావ్ లు చేయ‌డానికి బాస్మ‌తి బియ్యాన్నే ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. అయితే ఈ బియ్యం త‌ర‌చూ కాకుండా ఏదైనా శుభ‌కార్యం జ‌ర‌గ‌టం లేదంటే ఇంట్లో బిర్యానీ చేసుకోవ‌డం లాంటివి చేసిన‌ప్పుడే వండుకుంటూ ఉంటారు. ఇక బాస్మ‌తి బియ్యం ఆరోగ్యానికి అస‌లు మంచిదేనా లేదంగా హానిక‌ర‌మా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

Advertisement

 

కాగా బాస్మ‌తి రైస్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారు సాధార‌ణ బియ్యం కంటే బాస్మ‌తి రైస్ తింటే ఉప‌యోగం ఉంటుంద‌ని చెబుతున్నారు. బాస్మ‌తి రైస్ లో కొవ్వు త‌గ్గించే గుణాలు ఉంటాయని సూచిస్తున్నారు. మామూలు బియ్యం కంటే బాస్మ‌తి బియ్యం సులువుగా జీర్ణం అవుతాయ‌ట‌.

దాంతో ఎలాంటి జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉండ‌టంతో పాట గ్యాస్ ఎసిడిటి లాంటి స‌మస్య‌లు కూడా దూరంగా ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాస్మ‌తి బియ్యంలో చ‌క్కెర స్థాయి కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. దాంతో షుగ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని చెబుతున్నారు. అదేవిధంగా బిపీ కూడా బాస్మ‌తి బియ్యం తిన‌డం వ‌ల్ల నియంత్ర‌ణ లో ఉంటుంద‌ని ఆరోగ్య‌నిపుణులు చెబుతున్నారు.

ALSO READ :భార్య‌భ‌ర్త‌ల బంధం బ‌లంగా ఉండాలంటే పాటించాల్సిన 5 సూత్రాలు ఇవే..!

Visitors Are Also Reading