అందాల చందమామ కాజల్ అగర్వాల్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. చందమామ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తరవాత తన అందం అభినయం తో అవకాశాలను అందుకుంది. అయితే రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాతో కాజల్ కు ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చింది. ఆ తరవాత కెరీర్ లో తిరిగి వెనక్కి చూసుకోలేదు.
Advertisement
ప్రభాస్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ ,పవన్ కల్యాణ్ ఇలా అందరు స్టార్ హీరోలతోనూ కాజల్ సినిమాల్లో నటించింది. ఇక కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఓ కుమారుడు కూడా పుట్టాడు. ఇక పెళ్లై కొడుకు పుట్టిన తరవాత కూడా కాజల్ మళ్లీ సినిమాల్లో నటిస్తోంది.
Advertisement
అంతే కాకుండా హీరోయిన్ గా కూడా ఈ ముద్దుగుమ్మ అవకాశాలను అందుకుంటోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దాంతో ముద్దుగుమ్మ చేసిన కామెంట్ లు వైరల్ అవుతున్నాయి. హిందీ ఇండస్ట్రీలో క్రమశిక్షణ మరియు నైతిక విలువలు కనిపించవని చెప్పింది.
తాను పుట్టింది ముంబై అయినా హైదరబాద్ లో ఎక్కువ ఉన్నానని చెప్పింది. అంతే కాకుండా తెలుగు తమిళ ఇలా సౌత్ లోనే ఎక్కువ సినిమాలు చేశానని తెలిపింది. దాంతో చెన్నై మరియు హైదరాబాద్ లను తన నివాసాలుగా భావిస్తానని స్పష్టం చేసింది. సౌత్ లో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుందని చెప్పింది. ఇక్కడ టాలెంట్ ఉంటే ఎవరినైనా ప్రేక్షకులు ఆదరిస్తారని అందువల్లే టాలెంటెడ్ టెక్నీషియన్ లు దర్శకులు ఇక్కడ నుండి వస్తున్నారని వెల్లడించింది.