Home » ఇలా ఎందుకు జ‌రిగిందా అని బాధ‌ప‌డుతుంటా..మ‌నోజ్ విష్ణు గొడ‌వ పై స్పందించిన‌ పెద‌రాయుడు..!

ఇలా ఎందుకు జ‌రిగిందా అని బాధ‌ప‌డుతుంటా..మ‌నోజ్ విష్ణు గొడ‌వ పై స్పందించిన‌ పెద‌రాయుడు..!

by AJAY
Ad

ఇటీవ‌ల మంచువారింట్లో గొడ‌వ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కొద్దిరోజుల క్రిత‌మే మ‌నోజ్ మౌనికారెడ్డిల వివాహం జ‌రిగింది. ఇక ఆ పెళ్లి త‌రవాత కొద్దిరోజుల‌కే మంచు విష్ణు గొడ‌వ‌ల చేస్తున్నాడంటూ మ‌నోజ్ ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో విష్ణును ఇద్ద‌రు వ్య‌క్తులు ఆప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. వీడియో బ్యాక్ గ్రౌండ్ లో మ‌నోజ్ వాయిస్ వినిపిస్తుంది.

Advertisement

ఎప్పుడూ ఇలానే నా స‌న్నిహితులు బంధువుల ఇళ్ల‌పైకి వ‌చ్చి కొడుతూ ఉంటాడ‌ని చెబుతున్నాడు. మ‌నోజ్ వీడియో షేర్ చేసిన కొద్ది సేప‌టికే డిలీట్ చేశాడు. ఇక నిన్న మంచు విష్ణు ఓ వీడియోను షేర్ చేశాడు. మంచుస్ రియాలిటీ షో అంటూ ఇంట్లో కొన్ని సీన్ ల‌ను షూట్ చేసి వీడియోను రిలీజ్ చేశాడు. దాంతో అంద‌రిలో మ‌ళ్లీ క‌న్ఫ్యూజ‌న్ మొద‌లైంది.

Advertisement

అస‌లు మంచు బ్ర‌ద‌ర్స్ గొడ‌వ‌ప‌డ్డారా లేదా అని. అయితే తాజాగా మోహ‌న్ బాబు ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అన్న‌ద‌మ్ముల గొడ‌వ‌ల‌కు ఉదాహ‌ర‌ణ‌గా భార‌తాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెబుతూ…అన్న‌ద‌మ్ములు చిన్న‌పాటి అపార్దాలే చిలికి చిలికి గాలివాన‌లా మారాయి. గొడ‌వ‌ల ఏం వ‌స్తుంది.

చివ‌రికి అన్నీ కోల్పోయారు. నిజ‌జీవితంలోనూ అంతే మ‌న‌రస్ప‌ర్ద‌లు వ‌స్తే చివ‌ర‌కు ఏమీ రాదు. ఆనందాలు దూరం అవుతాయి.నేను ఏం జ‌రిగినా ఇలా ఇలా ఎందుకు జ‌రిగిందా అని బాధ‌ప‌డుతుంటాను. అలా జ‌రిగి ఉండ‌క‌పోతే బాగుండ‌ని అనుకుంటాను. ఇది ఎంత‌కాల‌మ‌ని చెప్ప‌లేం. అంటూ మోహ‌న్ బాబు వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading