Home » సీఎం కేసీఆర్‌ పై బాలయ్య షాకింగ్‌ కామెంట్స్‌.. !

సీఎం కేసీఆర్‌ పై బాలయ్య షాకింగ్‌ కామెంట్స్‌.. !

by Bunty

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సినీహీరో బాలకృష్ణ. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు సినీ హీరో బాలకృష్ణ,అఖండ చిత్ర యూనిట్. అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన దేవాలయం యాదాద్రి అన్నారు బాలయ్య.

ఇక్కడ పరిసరాలను కలుషితం చేయకుండా చేయాలన్నారు. అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలల్లో అని పుణ్యక్షేత్రలను దర్శించుకున్నాం అందులో భాగంగానే యాదాద్రి దర్శనానికి వచ్చామని వెల్లడించారు. యాదాద్రి ఒక అద్భుతమని… హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉందని తెలిపారు. కేసీఆర్‌.. యాదాద్రిలో చేసిన అభివృద్ధి పనులు చాలా అద్భుతమన్నారు బాలయ్య.

 

 

Visitors Are Also Reading