అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు పరిచయమే అక్కర్లేదు. బుల్లితెర పై అనసూయ తన అందాలతో ప్రేక్షులను మాయ చేసింది. జబర్దస్త్ టీవీ షోలో జబర్దస్త్ అందాలతో కుర్రాళ్ల మతిపోగొట్టింది.పొట్టిపొట్టి బట్టలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఇక జబర్దస్త్ లో ఉండగానే మరికొన్ని టీవీ షోలలో యాంకర్ గా అవకాశాలను అందుకుంది. అంతే కాకుండా ఆ తరవాత వెండితెరకు పరిచయం అయ్యింది.
Advertisement
సినిమా అవకాశాలు వెతుక్కుని రావడంతో మొదట క్షణం సినిమాలో తన నటనతో మెప్పించింది. ఆ తరవాత అనసూయను వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే మళ్లీ రంగస్థలం సినిమాతో అనసూయకు బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో రంగమత్త ప్రాత్రలో అనసూయ అదరగొట్టింది. అంతే కాకుండా పుష్ప సినిమాలో లేడీ విలన్ పాత్రలో నటించి ఆకట్టుకుంది.
Advertisement
ఇక ఇప్పుడు పుష్ప 2 తో పాటూ పలు చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక అనసూయ కేవలం స్క్రీన్ పైనే కాకుండా సోషల్ మీడియాలోనూ అందాల ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోననే అనసూయకు లక్షల్లో ఫాలోవర్ లు ఉన్నారు. అయితే అనసూయ సోషల్ మీడియాలో నెటిజన్ లు బ్యాడ్ గా కామెంట్ చేసినా లేదంటే ట్రోల్ చేసినా అస్సలు ఊరుకోదు.
వారిపై ఫైర్ అవుతూనే ఉంటుంది. అప్పట్లో అనసూయను ఆంటీ అంటూ కొంతమంది ట్రోల్ చేయడం తో తీవ్రస్థాయిలో మండిపడింది. కాగా తాజాగా డీజీపీ తన స్టేట్ మెంట్ లో సెలబ్రెటీలను ట్రోల్ చేసినా వారి ఫోటోలను మార్ఫింగ్ చేసినా కఠిన శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా ఆ వీడియోను అనసూయ షేర్ చేసి సెల్యూట్ ఎమోజీ ని జోడించింది.