తెలుగులో ఎన్నో టీవీ యాడ్స్ వస్తుంటాయి. అయితే కొన్ని యాడ్స్ కు మాత్రం ఎంతో గుర్తింపు వస్తుంది. దాంతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. ఇక ప్రోడక్ట్స్ కు రావాల్సిన క్రేజ్ కూడా యాడ్స్ ద్వారానే వస్తుంది. ప్రస్తుతం సుకీభవ యాడ్ ట్రెండ్ లో ఉంది. ఈ యాడ్ కు సంబంధించిన నల్లగుట్ట శరత్ అనే యువకుడు తన స్టైల్ లో పాడటంతో యాడ్ ఫేమస్ అయ్యింది. అయితే అప్పట్లో ఇదే రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న యాడ్ లలితా జ్యుయలరీస్…ఈ యాడ్ లో పెద్దగా నటీనటులు ఎవరూ ఉండరు కానీ యాడ్ కు మాత్రం తెగ పాపులారిటీ వచ్చింది. అయితే అలా పాపులారిటీ రావడానికి కారణం కూడా యాడ్ లో నటించిన కిరణ్ కుమార్ కావడం విశేషం.
Advertisement
కిరణ్ కుమార్ లలితా జ్యులరీస్ కోసం యాడ్ లో నటించిన నటుడు కాదు ఆయనే లలితా జ్యుయలరీస్ యజమాని కూడా అయితే ఆయన లుక్ గుండుతో కనిపించడం అంతే కాకుండా ఆయన బంగారం కొనాలని చెప్పే విధానం ఎంతగానో ఆకట్టుకున్నాయి. డబ్బులు ఊరికే రావు ముందుగా ధర చెక్ చేయండి నచ్చితేనే కొనండి అని చెప్పడంలో నిజాయితీ కనిపించింది. దాంతో లలితా జ్యుయలరీస్ గిరాకీ కూడా భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచీలు కూడా ఏర్పాటు చేశారు.
Advertisement
ఇదిలా ఉంటే కిరణ్ కుమార్ ఇది వరకూ ఓ సినిమాలో కూడా కనిపించారు. కానీ ఆ విషయం మాత్రం ఎవరికీ తెలియదు. రజినీకాంత్ హీరోగా సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి హీరోయిన్ లుగా లింగా సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే జ్యుయలరీ యజమానిగా నటించి కిరణ్ కుమార్ ఆకట్టుకున్నారు. ఇక ఆయన గుండే ఆయనకు అదృష్టం అని గుండు అని పిలిచినా తాను బాధపడను అని కిరణ్ కుమార్ చెబుతుంటారు.