Home » IPL 2023 : RCB హ్యాండ్ ఇచ్చిన డేంజర్ ప్లేయర్!

IPL 2023 : RCB హ్యాండ్ ఇచ్చిన డేంజర్ ప్లేయర్!

by Bunty

IPL 2023 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే,  ఐపీఎల్ 2023 సీజన్ ముంగిట రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఫ్రాంచైజికీ ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ గ్లెయిన్ మాక్స్వెల్ షాక్ ఇచ్చాడు.

READ ALSO : 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్… హైదరాబాదులో ఆ మ్యాచులు!

తాను పూర్తి ఫిట్నెస్ సాధించలేదని ఈ టోర్నీ బరిలోకి దిగడం కష్టమేనని తెలిపాడు. ఈ సీజన్ కోసం బెంగళూరుకు వచ్చిన ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నానని వెల్లడించాడు. ఈ మాటలో ఆర్సిబి మేనేజ్మెంట్ తో పాటు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే వేలంలో ఏరి కోరి తీసుకున్న విల్ జాక్స్ గాయంతో దూరం అవ్వగా, అతని స్థానాన్ని న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మైకేల్ బ్రెస్ వెల్ తో ఆర్సిబి భర్తీ చేసింది. ఇప్పుడు మ్యాక్సీ మామ తను ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని వెల్లడించడంతో అభిమానుల్లో కలవర పాటు మొదలైంది.

READ ALSO : జానకిరామ్ భార్య రెండో పెళ్లి చేసుకోకుండా… ఆ ఫోటోలు వైరల్?

glenn maxwell injury: IPL 2023: RCBs Glenn Maxwell hopes to stay fit before the start of Indian Premier League - The Economic Times

ఆర్సిబి ఫ్రాంచైజితో కలిసి ఈ సందర్భంగా మాట్లాడిన మాక్సి మామ 100% ఫిట్నెస్ సాధించడానికి మరి కొంత సమయం పడుతుందన్నాడు. ‘ఇప్పటికైతే నా కాళ్లు బాగానే ఉన్నాయి. కానీ 100% ఫిట్నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుంది. ఏదేమైనా సజావుగా సాగి టోర్నీ మొత్తం బాగా ఆడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అని మ్యాక్స్ వెల్ చెప్పుకొచ్చాడు

READ ALSO : మిస్ ఇండియా పోటీల్లో స్మృతి ఇరానీ ర్యాంప్ వాక్… వీడియో వైరల్

Visitors Are Also Reading